Aaradhya: అంబానీ ప్రీవెడ్డింగ్‌లో మెరిసిన జూనియర్‌ ఐశ్వర్య… భలే ఉందంటూ..!

శ్రీదేవిని (Sridevi) అతిలోకసుందరి అనేవాళ్లు… ఇప్పుడు జాన్వీ కపూర్‌ను (Janhavi Kapoor) జూనియర్‌ అతిలోక సుందరి అంటున్నారు. ఏదో అన్నారు కదా… అందం అట్టట్టా ఉంటుందేమో అనుకుంటే… భలే ముద్దుగా, అందంగా మెప్పించింది జాన్వీ కపూర్‌. శ్రీదేవి తర్వాత ఆ స్థాయిలో అందం గురించి పొగడ్తలు అందుకున్న బాలీవుడ్‌ కథానాయిక ఐశ్వర్య రాయ్‌. ఇప్పుడు ఆమె గురించి ఎందుకు ప్రస్తావన వచ్చింది అంటే… జూనియర్‌ ఐశ్వర్య కెమెరాల ముందుకు వచ్చింది కాబట్టి. ఇంకా చెప్పాలంటే వచ్చి అదరగొట్టింది కాబట్టి. అంబానీల ప్రీ వెడ్డింగ్‌ వేడుకకు ఆరాధ్య బచ్చన్‌ తన తల్లితో కలసి వచ్చింది.

ఈ క్రమంలో అక్కడ కెమెరాలు వరుస పెట్టి క్లిక్‌ మన్నాయి. ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్‌ మీడియా లైక్‌ల వర్షం అందుకుంటున్నాయి. ప్రపంచ సుందరిగానే కాకుండా సౌత్, నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందం ఐశ్వర్య రాయ్‌. ఇప్పుడు సినిమాల జోరు తగ్గించినా ఒకప్పుడు ఆమె సినిమాలు వరుస పెట్టి వచ్చేవి. ఆరాధ్యకు జన్మనిచ్చిన తర్వాత తగ్గిన జోరు… అదే ఫ్లో ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. అయితే చిన్నతనంలో ఎక్కువగా కనిపించిన ఆరాధ్య ఇప్పుడు పెద్దగా మీడియా ముందుకు రావడం లేదు.

చాలా నెలల తర్వాత ఆరాధ్య ఓ పబ్లిక్‌ ఫంక్షన్‌కి వచ్చింది. దీంతో ఆమెను చూసి నెటిజన్లు తెగ మెచ్చుచుకుంటున్నారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో తొలి రెండు రోజులు హీరోలు, హీరోయిన్లు హైలైట్‌ అవ్వగా… ఆఖరి రోజు మాత్రం ఆరాధ్యనే హైలైట్‌ అయింది అని చెప్పాలి. చిన్నప్పుడు క్యూట్‌కిడ్‌లా కనిపించిన ఆరాధ్య ఇప్పుడు తన మేనత్త నవ్యలా కనిపిస్తోంది అని అంటున్నారు. లుక్‌ కూడా కాస్త అలానే కనిపిస్తోంది కూడా.

మరికొందరు అయితే ఆమెకు ఉన్న చిరు మెల్లను పాయింట్‌ చేస్తున్నారు. (Abhishek Bachchan) అభిషేక్‌ బచ్చన్‌కు ఇలానే ఉంటుంది అని అంటున్నారు. మరికొందరు అయితే తల్లి అందం, తండ్రి మెల్ల లక్‌ కలిసొస్తాయి (Aaradhya) ఆరాధ్యకు అని అంచనా వేస్తున్నారు.

‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!

నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus