Abhishek Bachchan: ఓడిపోవాలని నిన్ను పెంచలేదన్నారు: చోటాబి

వారసత్వం, బంధుప్రీతి అంటుంటారు కానీ… సినిమాల్లోకి అలా వచ్చినవారందరి ప్రయాణం పూల దారి ఏమీ కాదు. ఈ విషయం ఎంత చెప్పినా వినని వాళ్లు చాలామంది ఉంటారు. అలాంటివారికి ఉదాహరణలుగా చాలామంది స్టార్స్‌ వారసులను చూపించొచ్చు. అందులో ఒకరు అభిషేక్‌ బచ్చన్‌. అమితాబ్‌ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అభిషేక్‌ యాక్టర్‌ లైఫ్‌ అంత సులభంగా ఏమీ జరగలేదు. ఒకానొక దశలో ఏకంగా సినిమాల నుండి తప్పుకుందాం అనుకున్నాడు కూడా. ఈ విషయాన్ని ఆయనే ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

ఇండస్ట్రీలోకి వచ్చాక అభిషేక్‌కు హిట్స్‌ వేసవికాలంలో వర్షాలు తరహాలో అప్పుడప్పుడు కనిపించాయి. దీంతో ఫ్లాప్​లతో కెరీర్​ సాగుతున్న సమయంలో ఒత్తిడి తట్టుకోలేక సినిమాల నుంచి తప్పుకోవాలని భావించాడట అభి. పరిశ్రమలోకి అడుగుపెట్టి పెద్ద తప్పు చేశానని అనుకున్నాడట. అంతేకాదు ఆ విషయాన్ని తండ్రి అమితాబ్‌ బచ్చన్‌కు కూడా చెప్పాడట. ‘నేను సినిమాల్లో నటించడానికి అర్హుణ్ని కాదు’ అంటూ ఆవేదనతో చెప్పాడట. ఆ మాట విన్న అమితాబ్‌ ‘నువ్వు ఓడిపోవాలని నిన్ను పెంచలేదు. బతతకడానికి పోరాడాలి’ అని అన్నారట. అంతేకాదు ‘నటుడిగా ప్రతి సినిమాకు నీవు మెరుగవుతున్నావు’ అని కూడా చెప్పారట.

అమితాబ్‌ మాటలు విన్న అభిషేక్‌కు కాస్త ఆత్మవిశ్వాసం పెరిగిందట. అందుకే ఇంకా చిత్రసీమలో కొనసాగుతున్నాడట అభిషేక్‌ బచ్చన్‌. అమితాబ్‌ వారసుడిగా అభిషేక్‌ బచ్చన్‌ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే తండ్రి స్థాయి ఫేమ్అం దుకోలేకపోయాడు. అలా అని ఆగిపోకుండా ఓటీటీలోకి వెళ్లాడు. ‘ది బిగ్​ బుల్’ పేరుతో ఇటీవల వెబ్‌ ఫిల్మ్‌ విడుదలైంది. అంతకుముందు మరో వెబ్‌ ఫిల్మ్‌ ‘లూడో’ వచ్చింది. మరో రెండు సినిమాలు వరుసలో ఉన్నాయి.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus