Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » మే 13న ఆచార్య వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ రిలీజ్‌!

మే 13న ఆచార్య వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ రిలీజ్‌!

  • January 30, 2021 / 12:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మే 13న ఆచార్య వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ రిలీజ్‌!

‘ఆచార్య దేవో భవ’ అని మన అందరికీ తెలిసిందే.. కానీ ‘ఆచార్య రక్షోభవ’ అని అంటున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. అసలు మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య గురించి అంత బలంగా ఎందుకు చెబుతున్నారు. అనే విషయం తెలియాలంటే ‘ఆచార్య’ సినిమా చూడాల్సిందేనని అంటోంది చిత్ర యూనిట్‌. మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘ఆచార్య’. స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను జనవరి 29, శుక్రవారం విడుదల చేశారు. టీజర్‌కు మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ వాయిస్‌ ఓవర్‌ను అందించారు. ఆచార్య పాత్రలో మెగాస్టార్‌ చిరంజీవి, సిద్ధ అనే మరో పవర్‌ఫుల్‌ పాత్రలో మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటిస్తుండటంతో సినిమా ఎలా ఉంటుందోనని అందరిలో ఆసక్తి పెరిగింది. ఇక చిరంజీవి, చరణ్‌ కాంబినేషన్‌ను వెండితెరపై వీక్షించడానికి మెగాభిమానులు సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

‘ఇతరుల కోసం జీవించేవారు దైవంతో సమానం. మరి అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే, ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పని లేదు. పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా, అందరూ ఎందుకు ఆచార్య అని అంటుంటారు, బహుశా గుణపాఠాలు చెబుతాననేమో’ అనే పవర్‌ ఫుల్‌ డైలాగ్స్‌తో మెగాస్టార్‌ చిరంజీవి ధర్మస్థలిలో ధర్మ సంరక్షణార్థం ఆచార్యగా ఏం చేశాడనే విషయాలను యాక్షన్‌ ప్యాక్‌డ్ ఆచార్య టీజర్‌లో చూపించారు. టీజర్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆచార్య దేవోభవ.. ఆచార్య రక్షోభవ అనే స్లోగన్‌ వినిపిస్తుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం పెద్ద ఎసెట్‌గా నిలుస్తోంది.

ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా కోసం హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన కోకాపేటలో వేసిన భారీ టెంపుల్‌ సెట్‌ను ఈ టీజర్‌లో మనం చూడొచ్చు. ఇండియాలో అతి పెద్ద భారీ టెంపుల్‌ సెట్‌ ఇది. ఈ సినిమాను మే 13న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఎస్‌.తిరునావుక్కరసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Chiranjeevi
  • #Druva
  • #Kajal Aggarwal
  • #Koratala Shiva

Also Read

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’ టీమ్ రిస్క్ చేస్తుందా?

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’ టీమ్ రిస్క్ చేస్తుందా?

related news

Chiranjeevi, Prabhas: స్పిరిట్ లో చిరంజీవి వార్తలో నిజమెంత?

Chiranjeevi, Prabhas: స్పిరిట్ లో చిరంజీవి వార్తలో నిజమెంత?

Chirutha: 18 ఏళ్ళ ‘చిరుత’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Chirutha: 18 ఏళ్ళ ‘చిరుత’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

గోపీచంద్ చేస్తే హిట్.. చిరంజీవి చేస్తే ప్లాప్..!

గోపీచంద్ చేస్తే హిట్.. చిరంజీవి చేస్తే ప్లాప్..!

బాలకృష్ణ కామెంట్స్ పై చిరంజీవి రియాక్షన్

బాలకృష్ణ కామెంట్స్ పై చిరంజీవి రియాక్షన్

OG: ‘ఓజి’ పై చిరు రియాక్షన్

OG: ‘ఓజి’ పై చిరు రియాక్షన్

Nag 100 Not Out: ‘నాగ్‌ 100 నాటౌట్‌’.. ఎప్పుడు, ఎవరి చేతిలో ప్రారంభిస్తారో తెలుసా?

Nag 100 Not Out: ‘నాగ్‌ 100 నాటౌట్‌’.. ఎప్పుడు, ఎవరి చేతిలో ప్రారంభిస్తారో తెలుసా?

trending news

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ ట్రైలర్ రివ్యూ

50 mins ago
This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Week Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో విడుదల కానున్న 17 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

1 hour ago
Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

Mirai Collections: డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మిరాయ్’

1 hour ago
OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

2 hours ago
Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

3 hours ago

latest news

The Rajasaab Trailer: ఇప్పుడెందుకు ట్రైలర్‌.. మొన్నే చేసిన ‘పీఆర్‌’ ప్లానింగ్‌ పని చేయలేదా?

The Rajasaab Trailer: ఇప్పుడెందుకు ట్రైలర్‌.. మొన్నే చేసిన ‘పీఆర్‌’ ప్లానింగ్‌ పని చేయలేదా?

10 mins ago
Harish Shankar: హరీశ్‌ శంకర్‌ మీద మరింత ఒత్తిడి.. ‘ఓజీ’ విజయం ఎంత బరువు పెంచిందంటే!

Harish Shankar: హరీశ్‌ శంకర్‌ మీద మరింత ఒత్తిడి.. ‘ఓజీ’ విజయం ఎంత బరువు పెంచిందంటే!

1 hour ago
Sujeeth: ‘ఓజీ’లో పాత సినిమాల రిఫెరన్స్‌.. ఆ పాటొక్కటే కాదు.. ‘అతడు’ కూడా టచ్‌ చేశారట!

Sujeeth: ‘ఓజీ’లో పాత సినిమాల రిఫెరన్స్‌.. ఆ పాటొక్కటే కాదు.. ‘అతడు’ కూడా టచ్‌ చేశారట!

1 hour ago
Deepika Padukone: దీపిక ఈ సినిమా కోసం ఆ రెండు సినిమాలూ వదులుకుందా.. చర్చలోకి కొత్త పేరు!

Deepika Padukone: దీపిక ఈ సినిమా కోసం ఆ రెండు సినిమాలూ వదులుకుందా.. చర్చలోకి కొత్త పేరు!

2 hours ago
K-Ramp: ‘కె ర్యాంప్‌’… బూతు కాదట, పెద్ద అర్థమే ఉందట.. ఎంత క్లారిటీ ఇచ్చినా డౌటే

K-Ramp: ‘కె ర్యాంప్‌’… బూతు కాదట, పెద్ద అర్థమే ఉందట.. ఎంత క్లారిటీ ఇచ్చినా డౌటే

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version