ఆచార్య ఈవెంట్ కు అతిథులు వీళ్లేనా?

చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆచార్య సినిమా రిలీజ్ కావడానికి మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నెల 23వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగనుంది. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాజమౌళి అతిథులుగా హాజరయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. అయితే ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Click Here To Watch NOW

చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఒకే వేదికపై కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తన డైరెక్షన్ లో ఇప్పటివరకు తెరకెక్కిన సినిమాలతో ప్రేక్షకులను నిరాశపరచలేదు. ఆచార్య సినిమాతో కొరటాల శివ ఖాతాలో మరో కమర్షియల్ హిట్ చేరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కొరటాల శివ ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో ఒక సినిమాను తెరకెక్కించనున్నారు. అయితే ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీ పాన్ ఇండియా సినిమానా? కాదా? అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.

ఈ సినిమాను హిందీలో విడుదల చేస్తారో లేదో క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే ఆచార్య సినిమా నుంచి విడుదలైన పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి. ఆచార్య మూవీ షూటింగ్ చాలాకాలం క్రితమే మొదలైనా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఆచార్య సక్సెస్ విషయంలో మెగా ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ సినిమాకు ఏపీలో టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు లభిస్తాయని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ఈ సినిమాకు రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని బోగట్టా. ఫుల్ రన్ లో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను అందుకుంటుందో చూడాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ సక్సెస్ ఆచార్య మూవీకి ప్లస్ కానుందని చెప్పవచ్చు. ఆచార్య రిలీజయ్యే సమయానికి కేజీఎఫ్2 హవా తగ్గే ఛాన్స్ అయితే ఉంది.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus