మెగాస్టార్ చిరంజీవి ఆరు పదుల వయసులో కూడా ఏమాత్రం అలుపులేకుండా వేగంగా సినిమాలను పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నేటి తరం యువ హీరోల కంటే కూడా ఆయన ఏమాత్రం తక్కువ కాదని చాలా ఎనర్జిటిక్ గా అయితే కనిపిస్తున్నారు. సైరా సినిమా అనంతరం వెండితెరకు చాలా గ్యాప్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని ఫిక్సయ్యారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా మరొక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే.
తప్పకుండా ఈ సినిమా అంచనాలకు మించి ఉంటుంది అని ప్రేక్షకుల నమ్ముతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ సినిమా ఫైనల్ కట్ ను ఇటీవల సిద్ధం చేసిన కొరటాల శివ ముందుగా ఈ రన్ టైమ్ ను అసలు లెక్క చేయలేదట. సాధారణంగా ఈ రోజుల్లో రెండున్నర గంటలు సినిమా ఉంటేనే ప్రేక్షకులను ఓపికతో థియేటర్లో కూర్చోబెట్టడం చాలా కష్టం గా మారిపోయింది.
అలాంటిది ఆచార్య అయితే ఏకంగా మూడు గంటలు ఉందని సమాచారం. ఇక ఫైనల్ కట్ చూసిన మెగాస్టార్ చిరంజీవి కాస్త షాక్ అయ్యారట. వెంటనే ఒక 15 నిమిషాలు సినిమా నిడివిని తగ్గించాలని సూచించారట. సినిమా ఎంత బాగున్నా కూడా దాదాపు మూడు గంటలు అంటే ప్రేక్షకులలో ఎక్కడో ఇబ్బంది గా అనిపించే అవకాశం ఉంది అని అందుకే ఈ మూడు గంటలు అనేది అస్సలు కనిపించకుండా తగ్గించాలని అన్నారట.
ఇక మెగాస్టార్ చిరంజీవి సూచించిన దాన్ని బట్టి కొరటాల శివ కూడా అదే తరహాలో రన్ టైమ్ ను తగ్గిస్తున్నట్లు గా తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమాను రెండు గంటల 45 నిమిషాలకు సెట్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇక ఏప్రిల్ 29న విడుదల కాబోయే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!