Acharya: మెగాస్టార్ సినిమా కాపీ గొడవ ఏమైందంటే..?

మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఆచార్య’ టీజర్ విడుదలైన దగ్గర నుంచి ఒక వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ తనదని.. కొరటాల శివ దాన్ని కాపీ చేసి ఈ సినిమా తీస్తున్నాడని రాజేష్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ ఆరోపించడం అప్పట్లో దుమారం రేపింది. ఈ విషయంలో అతడు చాలా సీరియస్ అయ్యాడు. తాను ఒక కథ రాసుకొని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ద్వారా మైత్రి మూవీ మేకర్స్ వారని కలిసి ఈ కథ చెప్పానని తెలిపాడు.

వాళ్లు కొరటాల శివ లాంటి పెద్ద దర్శకుడు ఈ కథను డైరెక్ట్ చేస్తే బాగుంటుందని అభిప్రాయ పడ్డారని.. కథ అడిగితే తాను ఇవ్వనన్నానని.. తరువాత తన కథనే కొరటాల శివ కాపీ కొట్టి చిరంజీవితో ‘ఆచార్య’ తీశాడని ఆరోపించాడు. ‘ఆచార్య’ సినిమాకి పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లలో ఒకరు రెండు కథలూ ఒకటేనని కన్ఫర్మ్ చేశారని కూడా రాజేష్ పేర్కొన్నాడు.

దీని మీద కొరటాల సైతం టీవీ ఛానెళ్ల డిబేట్స్ లో పాల్గొన్నాడు. రాజేష్ కథకు తన స్టోరీకి సంబంధం లేదని వాదించాడు. తనది పెద్ద సినిమా కావడంతో కథను ఇప్పుడు బయటపెట్టలేనని.. రేప్పొద్దున సినిమా చూశాక తన కథ వేరని ఆరోపణలు చేసిన వ్యక్తికే అర్ధమవుతుందని ఆయన పేర్కొన్నాడు. ఈ వివాదం మీద కొన్ని వారాల కిందట కూడా రాజేష్ ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు.

దీంతో ‘ఆచార్య’ సినిమా విడుదలైన ఈ వివాదం ఓ కొలిక్కి వస్తుందంటూ అందరూ ఎదురుచూశారు. మొత్తానికి ఈ సినిమా విడుదలైంది. ఇప్పుడు ‘ఆచార్య’ కథ మీద క్లారిటీ వచ్చింది. తన కథనే కాపీ కొట్టి కొరటాల శివ సినిమా చేసి ఉంటే.. అతను ఇప్పుడు పాయింట్ పట్టుకొని మాట్లాడొచ్చు. అతడి కథ ఆల్రెడీ రిజిస్టర్ కూడా అయింది కాబట్టి రచయితల సంఘానికి కూడా ఒక క్లారిటీ వస్తుంది. మరి ఈ విషయంపై రాజేష్ ఎలా స్పందిస్తాడు..? తన ఆరోపణలకు కట్టుబడి ఉంటుందా అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus