Chiranjeevi: ఆ ఊహాగానాలకు చెక్ పెట్టిన ‘ఆచార్య’ టీం.. ట్రైలర్ ఎప్పుడంటే?

గత రెండేళ్ళుగా పెండింగ్లో ఉన్న పెద్ద పెద్ద సినిమాలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ అవుతున్నాయి. ఆల్రెడీ ‘రాధేశ్యామ్’ .. ‘ఆర్ ఆర్ ఆర్’ వంటి బడా సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరో వారంలో ‘కె.జి.ఎఫ్2’ కూడా రిలీజ్ కాబోతుంది. ఈ పెద్ద సినిమాల లిస్ట్ లో చిరంజీవి- చరణ్ ల ‘ఆచార్య’ కూడా ఒకటి. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు. చిరుకి జోడీగా కాజల్ హీరోయిన్ గా నటించగా… చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది.

‘ఆచార్య’ కూడా మల్టీస్టారర్ మెటీరియల్ ఉన్న సినిమానే.! ఇప్పటివరకు చిరు- చరణ్ లు చిన్న రోల్స్ లో లేదా పాటల్లో మెరిశారు. కానీ ఈ సినిమాలో చిరు ఫుల్ లెంగ్త్ హీరోగా నటిస్తుండగా.. చరణ్ కూడా లెంగ్త్ ఉన్న రోల్ ను పోషిస్తున్నాడు. ఏప్రిల్ 29న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్లు, పాటలకి మంచి స్పందన లభించింది. కాగా ఇప్పుడు ట్రైలర్ ను కూడా విడుదల చేయడానికి చిత్ర బృందం రెడీ అయ్యింది.

‘శ్రీరామ నవమి’ సందర్భంగా ఏప్రిల్ 10న ‘ఆచార్య’ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు అని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో డిస్కషన్లు మొదలయ్యాయి. అయితే వాటికి చెక్ పెడుతూ.. ఏప్రిల్ 12న ‘ఆచార్య’ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది చిత్ర బృందం.అందుకు సంబంధించిన ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది.అయితే ఈ పోస్టర్ లో చిరు కాకుండా, చరణ్ – పూజా హెగ్డే లు ఉండడం విశేషం.

ఇక మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తూ ఉండగా.. ‘మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ మరియు ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ల పై నిరంజన్ రెడ్డి, చరణ్ లు కలిసి నిర్మిస్తున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus