ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) హీరోయిన్ నిక్కీ గల్రానీని (Nikki Galrani) ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2022 మే 18న వీరి వివాహం జరిగింది. పలు సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా చేసిన వీరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారడంతో.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే మొన్నామధ్య వీళ్ళు పేరెంట్స్ కాబోతున్నారని ఒకసారి.. లేదు విడిపోతున్నారు అని మరోసారి… వార్తలు వచ్చాయి.ఆ ప్రచారంపై ఆది స్పందించి క్లారిటీ ఇచ్చాడు.
ఆది నటించిన ‘శబ్దం’ (Sabdham) మూవీ ఫిబ్రవరి 28న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆది స్పందించాడు. ఆది మాట్లాడుతూ… “నేను (Aadhi Pinisetty).. నిక్కీ గల్రాని కొన్నాళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాం. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ మేము విడాకులు తీసుకుంటున్నాం అని మొన్నామధ్య ఓ వార్త వచ్చింది. అది చూసి మేము షాక్ అయ్యాం. అంతేకాదు ఆ టైంలో తను, నేను చాలా ఇబ్బంది పడ్డాం.
ఎందుకు ఇలాంటి వార్త వచ్చింది… అంటూ దాని గురించి చాలా ఆలోచించాల్సి వచ్చింది. అసలు సంబంధమే లేకుండా ఇలాంటి వార్త పుట్టించి వీడియో చేసిన వాళ్ళని ఏమనాలి? నిజానికి వాళ్ళు క్రియేట్ చేసే గాలివార్తలకు ప్రాముఖ్యత ఇవ్వకూడదు. అలా ఇవ్వడం వల్ల వాళ్ళని ఫ్రీగా సెలబ్రిటీలను చేసినట్లు అవుతుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లేకుండా వాళ్ళు బ్రతికేస్తున్నారు. సో అలాంటి వాళ్ళు పుట్టించే గాసిప్స్ ను లైట్ తీసుకోవడం ఉత్తమం అని నాకు (Aadhi Pinisetty) అనిపించింది” అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.