Ajay: 2024 బెస్ట్ మూవీ దేవర అంటున్న అజయ్.. అంచనాలు పెంచారుగా!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర ఈ ఏడాది అక్టోబర్ నెల 10వ తేదీన విడుదల కానుంది. దేవర (Devara) సినిమా యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లా ఉండనుంది. ఈ సినిమాలో అజయ్ (Ajay) కీలక పాత్రలో నటిస్తుండగా ఆయన వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. 2024 బెస్ట్ మూవీ దేవర అని అజయ్ కామెంట్లు చేస్తున్నారు.

దేవర సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్నా టాలీవుడ్ నటులకు ఈ సినిమాలో ఎక్కువగా ప్రాధాన్యత దక్కింది. అజయ్ మాట్లాడుతూ నేను ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలనని దేవర సినిమా బెస్ట్ ఆఫ్ ఇండియా మూవీ అవుతుందని ఈ సినిమాలో బెస్ట్ ఆఫ్ తారక్ ను చూస్తారని అజయ్ పేర్కొన్నారు. ఈ సినిమాలో బెస్ట్ విజువల్స్ ను చూస్తారని ఆయన వెల్లడించడం గమనార్హం.

కొరటాల శివ బెస్ట్ ఆఫ్ రైటింగ్ ఈ సినిమాలో కనిపిస్తుందని అజయ్ అన్నారు. 2024 బెస్ట్ ఫిల్మ్ దేవర అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని అజయ్ పేర్కొన్నారు. కథ, కథనంతో పాటు ఈ సినిమాలో ఎలివేషన్స్ సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని అజయ్ పేర్కొన్నారు. ఈ విషయాలు అయితే నేను ఖచ్చితంగా చెప్పగలనని ఆయన తెలిపారు. మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తైందని అజయ్ వెల్లడించారు.

అజయ్ చేసిన కామెంట్లు ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెంచుతున్నాయి. దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా దేవర1 ఈ ఏడాదే విడుదల కానుండటం గమనార్హం. దేవర సినిమా ఫ్యాన్స్ ను కచ్చితంగా మెప్పించే మూవీ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవర సినిమా ఎప్పుడూ విడుదలైనా బాక్సాఫీస్ ను షేక్ చేసే బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus