ప్రముఖ మలయాళ నటుడు, నిర్మాత అయిన విజయ్‌బాబు పై లైంగిక ఆరోపణలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. తాను నిర్మించే సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తాను అని మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఇతనిపై ఓ జూనియర్ నటి… మహిళల పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసి అతనిపై కేసు నమోదు చేసింది. దీంతో విజయ్ బాబుని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయం పై కొన్ని నెలల క్రితమే విజయ్ బాబుపై కేసు నమోదు అయ్యింది.
అయితే ముందు జాగ్రత్తగా ఆయన కేరళ హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోవడం వల్ల వెంటనే బయటకు వచ్చాడు. కొన్ని నిబంధనలు జారీ చేసి అతనికి హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ నిబంధనల ప్రకారం అతని బాధిత నటి పేరు ఎక్కడా ప్రస్తావించకూడదు. కానీ విజయ్ బాబు మాత్రం ఇటీవల సోషల్ మీడియాలో ఆ నటి పేరుని వెల్లడించాడు. ఈ కారణంగా అతన్ని మళ్ళీ అరెస్ట్ చేశారు కేరళ పోలీసులు. అయితే మళ్ళీ అతను బెయిల్ పై రిలీజ్ అయ్యాడట.
కానీ జూలై 3 వరకు అతన్ని ప్రశ్నించడానికి హైకోర్టు పోలీసులకి అనుమతులు ఇచ్చింది. ఇక విజయ్ బాబు వయసు ప్రస్తుతం 46 ఏళ్ళు కాగా అతను నిర్మాతగా 14 సినిమాలు నిర్మించాడు. అంతేకాకుండా అతను 45 సినిమాల్లో నటించారు. విజయ్ బాబు భార్య పేరు స్మిత.. ఆమె దుబాయ్ లో తమ బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటుంది. అలాగే ఇతనికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. అతని పేరు భరత్.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!