Bandla Ganesh: రవితేజ ఉదయాన్నే షూటింగుకి ఎలా వెళ్తాడో చెప్పిన బండ్ల గణేష్.. వీడియో వైరల్..

మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల ‘దమాకా’ తో సూపర్ హిట్ కొట్టడమే కాక కెరీర్‌లో ఫస్ట్ టైం రూ. 100 కోట్ల వసూళ్లు రాబట్టాడు. తర్వాత మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీతో రూ. 200 కోట్ల మార్క్ టచ్ చేశాడు. ప్రస్తుతం ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వర రావు’ వంటి సినిమాలు చేస్తున్నాడు. ఆయన వయసు పెరిగే కొద్దీ మరింత ఉత్సాహంతో పని చేస్తున్నాడు అనడానికి ఉదాహరణగా నటుడు,

నిర్మాత బండ్ల గణేష్ తన ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియో రవితేజ ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. రవితేజ అన్న ఉదయాన్నే షూటింగుకి ఇలా ఎనర్జీతో వెళ్తాడు అంటూ ఏరు దాటి పరిగెడుతున్న చిరుత పులి వీడియో పోస్ట్ చేశారు. ఓ నెటిజన్.. ‘‘ఏంటి గణేష్ అన్నా.. బాగా ఫ్రీక్వెంట్‌గా ట్వీట్లు వేస్తున్నావ్ రవన్న గురించి…ఏంటి మేటర్?’’ అని అడగ్గా.. ‘‘బ్లాక్ బస్టర్ కోసం తమ్ముడు’’ అంటూ రిప్లై ఇచ్చారు బండ్ల గణేష్. రవితేజ హీరోగా ‘ఆంజనేయులు’ సినిమాతో నిర్మాతగా మారారాయన.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus