ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన చలపతిరావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నాకు హైదరాబాద్ లో ఇల్లు లేదని చలపతిరావు కామెంట్లు చేశారు. తాను అపార్థం చేసుకునే ఛాన్స్ ఎవరికీ ఇవ్వలేదని ఆయన చెప్పుకొచ్చారు. కరోనా మొదలైనప్పటి నుంచి తాను వేదాలు చదవడం మొదలుపెట్టానని ఆయన కామెంట్లు చేశారు. నేను అన్ని మతాల గ్రంథాలు చదువుతానని ఆయన చెప్పుకొచ్చారు. రోజూ ఒక అధ్యాయం చొప్పున భగవద్గీత చదువుతానని ఆయన కామెంట్లు చేశారు.
నాకు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఒకటేనని ఇద్దరూ ఎంతో గౌరవం ఇస్తారని ఆయన చెప్పుకొచ్చారు. తాను ఇద్దరితోనూ యాక్ట్ చేశానని ఆయన వెల్లడించారు. అందరూ తనకు ఈక్వల్ అని తనకు ఆ డిఫరెన్స్ ఉండదని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం. జూనియర్ ఎన్టీఆర్ పుట్టడం అవి అన్నీ తనకు తెలుసని ఆయన తెలిపారు. మీరు రాజకీయాల్లోకి వెళుతున్నారు కదా మా పొజిషన్ ఏంటి అని సీనియర్ ఎన్టీఆర్ ను తాను అడిగానని ఎన్టీఆర్ రాజకీయాలు వద్దని
ఈ లోతు బురదలో కూరుకుపోయున్నానని మనవాళ్లను ఎవరినీ రావద్దని చెప్పని ఈ రాజకీయాలంత దరిద్రం లేదని ఆయన చెప్పాడని చలపతిరావు కామెంట్లు చేశారు. సీనియర్ ఎన్టీఆర్ చెప్పిందే ఇతరులకు చెప్పానని ఆయన అన్నారు. సీనియర్ ఎన్టీఆర్ ను దూరంగా పెట్టడం సినిమాల విషయంలో జరగలేదని చలపతిరావు తెలిపారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ ఎన్టీఆర్ ను చూడాలని చెబితే తీసుకెళ్లామని సీనియర్ ఎన్టీఆర్ ను చూసిన వెంటనే ఆయన కాళ్లపై పడిపోయారని చలపతిరావు అన్నారు.
మొదట కాళ్లపై పడటం నచ్చదని చెప్పిన ఆ ఆఫీసర్ ఎన్టీఆర్ కాళ్లపై పడ్డారని సీనియర్ ఎన్టీఆర్ లో ఆ తేజస్సు ఉంటుందని చలపతిరావు పేర్కొన్నారు. సీనియర్ ఎన్టీఆర్ పొద్దున్నే ప్రాణాయామం చేసేవారని చలపతిరావు వెల్లడించారు. సీనియర్ ఎన్టీఆర్ ను నాకు తెలిసి ఎవరూ దూరం పెట్టలేదని చలపతిరావు అన్నారు.
Most Recommended Video
పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!