సినీ పరిశ్రమలో మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది.నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇలా వివిధ విభాగాలకు చెందిన వారు ఎంతోమంది కన్నుమూసిన సందర్భాలు అనేకం మనం చూశాం. అంతేకాదు కొంతమంది హీరోలు, హీరోయిన్ల కుటుంబంలో కూడా మరణ వార్తలు ఎక్కువగా వినిపించాయి. ఈ లిస్ట్ లో కూడా చాలా మంది ఉన్నారు.మీనా భర్త, ఆర్.నారాయణ మూర్తి తల్లి, నోయల్ తండ్రి, అర్జున్ తల్లి, ఇంకా బాలీవుడ్, కోలీవుడ్,మలయాళం,పంజాబీ, మరాఠీ… భాషల్లోని సినీ ప్రముఖులు కూడా మరణించడం అందరినీ ఆందోళన కలిగిస్తుంది.
హీరో హీరోయిన్లకు ఫ్యాషన్ డిజైనర్లు గా వ్యవహరించేవారు కూడా సూసైడ్ చేసుకోవడం కూడా అందరికీ తెలిసిన సంగతే. నిన్నటికి నిన్న సీనియర్ ఎన్టీఆర్ చిన్న కూతురు కూడా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో నటుడు మరణించిన సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది. మలయాళ నటుడు బాబూరాజ్ వాజపల్లి ఆదివారం నాడు కన్నుమూశారు.ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీవ్రమైన ఛాతి నొప్పి కారణం ఆయన్ని ఓమస్సేరిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తున్న సందర్భంలో ఆయన కన్నుమూసినట్టు తెలుస్తుంది.
ఆయన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లిన తర్వాత వైద్యులు ఆయన మరణించినట్లు ఖరారు చేసారని సమాచారం. బాబురాజ్‌కు భార్య సంధ్య బాబురాజ్, కుమారుడు బిషల్ ..లు ఉన్నారు. ఆదివారం మాంగవ్ ప్రభుత్వ శ్మశానవాటికలో ఈయన అంత్యక్రియలు జరిగినట్టు తెలుస్తుంది.ఈయన ‘త్రిస్సూర్‌లో డ్రామా స్కెచ్’ల ద్వారా కెరీర్ ప్రారంభించాడు.
బాబూరాజ్ ఆండ్రాయిడ్ కుంజప్పన్, సీఐఏ, మాస్టర్ పీస్, గుండా జయన్, బ్రేకింగ్ న్యూస్, మనోహరన్ ,అర్చన 31 నాటౌట్ వంటి మలయాళ చిత్రాల్లో కూడా నటించినట్టు తెలుస్తుంది. నటుడిగానే కాదు ఆర్ట్ డైరెక్టర్ గా, స్క్రీన్ రైటర్ గా ఇలా ఎన్నో విభాగాల్లో ఆయన పనిచేశారు.
Most Recommended Video
అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?