గతంలో ఎన్నో చిత్రాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అటు తర్వాత కమెడియన్ గా చేసిన నటుడు గిరిబాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పుడు కూడా అడపా దడపా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న ‘జాతి రత్నాలు’ సినిమాలో కూడా గిరిబాబు నటించిన సంగతి తెలిసిందే. అందులో ఓ రాజకీయ పార్టీ పెద్దగా ఆయన కనిపించారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గిరిబాబు.. తన కొడుకు కెరీర్ ను కొంతమంది నాశనం చేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. వివరాల్లోకి వెళితే.. గిరిబాబు కొడుకు అనగానే అందరికీ రఘుబాబు గుర్తుకొస్తాడు.
కానీ అతను పెద్ద కొడుకు.. ప్రస్తుతం కమెడియన్ గా రాణిస్తున్నాడు. గిరిబాబుకి చిన్న కొడుకు కూడా ఉన్నాడు. అతని పేరు బోసుబాబు. ఇతన్ని హీరోగా పెట్టి ఓ కౌబాయ్ సినిమాని కూడా నిర్మించాడు గిరిబాబు. ఆ చిత్రం పేరు ‘ఇంద్రజిత్’. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘కొదమసింహం’ సినిమాకి ముందు ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు అప్పట్లో ప్రకటించారు. కానీ సడెన్ గా ‘కొదమసింహం’ చిత్రాన్ని ప్రీపోన్ చేస్తున్నట్లు ప్రకటించారు ఆ చిత్రం మేకర్స్. దీంతో ‘ఇంద్రజిత్’ సినిమాని పోస్ట్ పోన్ చేశారట. ముందుగా విడుదలైన ‘కొదమసింహం’ చిత్రం ప్లాప్ అయ్యింది.
‘చిరంజీవికే వర్కౌట్ అవ్వని కౌబాయ్ మూవీ కొత్త హీరో చేస్తే చూస్తారా ఏంటి?’ అంటూ విడుదల కాబోతున్న ‘ఇంద్రజిత్’ సినిమా పై కామెంట్లు మొదలయ్యాయట. దాంతో రూ.40 లక్షలతో తెరకెక్కించిన ‘ఇంద్రజిత్’ కు రూ.20 లక్షల బిజినెస్ మాత్రమే జరిగిందట. మొదటి షోతో ‘ఇంద్రజిత్’ కు పాజిటివ్ టాక్ వచ్చింది. ఫుల్ రన్లో రూ.40 లక్షలు పైనే కలెక్ట్ చేసిందట.బయ్యర్స్ సేఫ్ అయ్యారు. కానీ బోసుబాబు కి ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. ‘కొదమసింహం’ ఎఫెక్ట్ బోసు బాబు కెరీర్ పై పడింది. అంతేకాకుండా ఇతని కెరీర్ నాశనం కావడానికి కొంతమంది కుట్ర చేశారని కూడా గిరిబాబు వ్యాఖ్యానించారు.