మహేష్ బాబుతో దిగిన ఫోటోలు షేర్ చేసి.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన జయరాం!

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూడో చిత్రం షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుంది. అయితే మహేష్ బాబు, శ్రీలీల, పూజా హెగ్డే వంటి వారు తప్ప.. ఈ చిత్రంలోని మిగతా నటీనటుల గురించి చిత్ర బృందం ఇంకా రివీల్ చేయలేదు. అయితే ఈ సినిమాలో మలయాళ నటుడు జయరామ్ కూడా నటిస్తున్నట్టు తాజాగా కన్ఫర్మ్ చేశాడు. ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో కూడా ఇతను ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

సో దాదాపు అదే టీం ఈ మూవీలో కూడా నటిస్తున్నట్టు జయరామ్ వల్ల స్పష్టమవుతుంది. మహేష్, త్రివిక్రమ్ తో దిగిన ఫోటోలను జయరాం షేర్ చేసి.. ”థియేటర్లలో కృష్ణ గారి సినిమాలు చూస్తూ పెరిగినవాడిని.! ఇప్పుడు ఆయన కొడుకు, గొప్ప వ్యక్తి మహేష్ బాబుతో పని చేస్తున్నాను. ఇప్పుడు మరోసారి మా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉంది” అంటూ జయరాం తన సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.

ఇక ఈ చిత్రం టైటిల్ ను ఉగాది పండుగ రోజున చిత్ర బృందం రివీల్ చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే చిత్ర బృందం నుండి ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. కానీ మహేష్ 28 కి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ అయితే ఆ రోజు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈలోపే జయరాం మహేష్ అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వడం విశేషంగా చెప్పుకోవాలి. ఇక ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus