‘మగధీర’ లాంటి పెద్ద సినిమా తర్వాత ‘మర్యాద రామన్న’ అనే చిన్న సినిమా తీశారు రాజమౌళి. దీని వెనుక పెద్ద లాజిక్ ఏమీ లేదు. అంచనాలు పెరిగిపోకుండా చూసుకోవాలనుకోవడమే అంటుంటారు పరిశ్రమ నిపుణులు. అల ‘బాహుబలి’ తర్వాత కూడా ఓ చిన్న సినిమా చేస్తారని అందరూ ఊహించారు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ అంటూ మరో భారీ చిత్రం ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఈ ప్రకటనకు ముందు ఆయన ఆలోచనలు వేరట. ఈ విషయాన్ని ప్రముఖ నటుడు మకరంద్ దేశ్‌పాండే చెప్పారు.
సినిమాలో భీమ్ పాత్రధారి తారక్‌కు పెద్దన్నగా నటించారు మకరంద్ దేశ్‌పాండే. ఆయన ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సినిమా ఆలోచన ఎలా వచ్చింది, వచ్చినప్పుడు రాజమౌళి ఏం చేశారు, ఆ విషయాన్ని ఎలా వెల్లడించారు అనేది ఇప్పటికే వివిధ ఇంటర్వ్యూల్లో రామ్‌చరణ్, తారక్, రాజమౌళి చెప్పారు. అయితే ఈ సినిమా ఆలోచన వచ్చే ముందు రాజమౌళి ఏమనుకున్నారు అనేది మకరంద్ దేశ్‌పాండే తెలిపారు.
‘ఆర్ఆర్ఆర్’ కంటే ముందు రాజమౌళి ఒక చిన్న సినిమా తీద్దామనుకున్నారట. అయితే మంచి లవ్ స్టోరీగా చేద్దామనుకున్నారట. కానీ రాజమౌళి భార్య రమ ఆలోచన మాత్రం వేరేగా ఉండిందట. నీకు బెస్ట్ అనిపించే సినిమా చేయు అని రాజమౌళికి ఆమె సూచించారట. దీంతో రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఆలోచన చేసి, దాని మీదే ఫోకస్ చేశారని మకరంద్ దేశ్‌పాండే వెల్లడించారు. అలా రాజమౌళి నుండి ప్రేమ కథ బదులు ‘ఆర్‌ఆర్ఆర్’ వచ్చిందన్నమాట.
ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. తొలి రోజుల్లో కాస్త మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అయితే అవేవీ సినిమా వసూళ్ల మీద ప్రభావం చూపించలేదు. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 700 కోట్లు వసూళ్లు సాధించిన ఈ సినిమా రూ. వెయ్యి కోట్ల వైపు దూసుకెళ్తోంది. త్వరలో అధికారికంగా రూ.వెయ్యి కోట్ల పోస్టర్ విడుదల చేస్తారని సమాచారం. ఇక ఈ సినిమా ఓటీటీలో మే 25న విడుదల చేస్తారని సమాచారం. త్వరలో దీనిపై క్లారిటీ వస్తుందంటున్నారు.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?