మోహన్ బాబు ప్రస్తుతం తన సొంత విద్యాసంస్థలకు రావాల్సిన ‘ఫీజు రీఎంబర్స్ మెంట్’ పై ప్రత్యేక పోరాటం సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా అయన పై తాజాగా చెక్ బౌన్స్ కేసు నమోదయ్యింది. అంతేకాదు ఏడాది జైలు శిక్ష కూడా పడింది. ఈ కేసు వేసింది ఎవరో ‘బొమ్మరిల్లు’ నిర్మాణ సంస్థ అధినేత, ప్రముఖ దర్శకుడు అయిన వై.వి.ఎస్. చౌదరి. 2010 లో మోహన్ బాబు, విష్ణులతో ‘సలీం’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు వై.వి.ఎస్. చౌదరి. ఆ సమయంలో తన పారితోషికం నిమిత్తం ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యిందని సుమారు 10 ఏళ్ళ తరువాత వై.వి.ఎస్. చౌదరి కేసు వేయడం పై లేని పోనీ అనుమానాలకు దారి తీస్తున్నాయి.
ఇందు నిమిత్తం మోహన్ బాబు కి 41.76 లక్షల జరిమానా విధించింది ఎర్రమంజిల్ కోర్టు. ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ గా మారింది. ఇదంతా తెరవెనుక నుండీ చంద్ర ఆడిస్తున్న డ్రామా అని మోహన్ బాబు సన్నిహిత వర్గం చెప్పుకొస్తున్నాయి. ఇటీవల మోహన్ బాబు… వైసిపి పార్టీ లో చేరడం, చంద్రబాబు పై ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వంటి సెటైరికల్ చిత్రాన్ని తెరకెక్కించిన ఆర్జీవీ తో కలవడం చూసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలా చేయించారని వారు చెబుతున్నారు. అందులోనూ వై.వి.ఎస్. చౌదరి కూడా నందమూరి ఫ్యామిలీకి పెద్ద భక్తుడన్న విషయం అందరికీ తెలిసిందే కదా అని వారు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.