Sai Dharam Tej: సాయితేజ్‌ బైక్‌ యాక్సిడెంట్‌పై నరేశ్‌ స్పందన!

సాయిధరమ్‌ తేజ్‌కు శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతాల యాక్సిడెంట్‌ అయ్యిందన్న విషయం తెలిసిందే. అయితే యాక్సిడెంట్‌ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, అసలు సాయితేజ్‌ అప్పుడు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాడు అనే విషయంలో సరైన స్పష్టత లేదు. తాజాగా ఈ విషయమై నటులు నరేశ్‌ స్పందించారు. ఈ మొత్తం వ్యవహారంపై ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు. రోడ్డు ప్రమాదం జరగడానికి ముందు సాయి తేజ్‌ తన ఇంటి నుంచే బయలుదేరాడని నరేశ్‌ తెలిపారు. తన కుమారుడు నవీన్‌ విజయ కృష్ణకు సాయితేజ్‌ మంచి స్నేహితుడని, అందుకే మా ఇంటికి సాయి తేజ్‌ తరచూ వస్తుంటారని చెప్పారు నరేశ్‌.

అలా శుక్రవారం కూడా మా ఇంటి నుండి తిరిగి వెళ్తుంటే ఈ ప్రమాదం జరిగింది అని నరేశ్‌ చెప్పారు. సాయి వేగంగా కోలుకుని, ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆ దేవుడిని వేడుకుంటున్నట్లు నరేశ్‌ చెప్పారు. సాయిధరమ్‌ తేజ్‌ నా బిడ్డలాంటివాడు. నా కొడుకు నవీన్‌ విజయ కృష్ణ-సాయి అన్నదమ్ముల్లా ఉంటారు. శుక్రవారం వాళ్లిద్దరూ ఇంటి నుండే బయలుదేరారు. బైక్‌పై స్పీడ్‌గా వెళ్లొద్దని చెప్పాలనుకుని బయటకు వచ్చేసరికే.. వాళ్లు బయలుదేరిపోయారు. నాలుగు రోజుల క్రితమే వారికి… బైక్‌ రైడింగ్‌ మీద కౌన్సెలింగ్‌ ఇవ్వాలనుకున్నాను. కానీ కుదరలేదు.

జీవితంలో సెటిల్‌ కావాల్సిన వయసు వాళ్లది. ఇలాంటప్పుడు రిస్క్‌లు తీసుకోకుండా ఉండటమే మంచిది అనేది నా అభిప్రాయం అని నరేశ్‌ చెప్పారు. అంతేకాదు గతంలో ఆయన జీవితంలో జరిగిన సంఘటన గురించి కూడా నరేశ్‌ చెప్పారు. గతంలో నరేశ్‌ కూడా బైక్‌ డ్రైవింగ్‌కు వెళ్లి ప్రమాదానికి గురయ్యారట. ఆ తర్వాత ఆయన మాతృమూర్తి విజయనిర్మల ఒట్టు వేయించుకోవడంతో అప్పటి నుండి బైక్స్ జోలికి పోలేదని చెప్పారు నరేశ్‌. ఆస్పత్రికి వెళ్లి సాయితేజ్‌ను పరామర్శించాలనుకున్నాను. కాకపోతే పరిస్థితుల దృష్ట్యా అక్కడికి వెళ్లలేకపోతున్నాను. త్వరలోనే కలుస్తాను అని నరేశ్‌ చెప్పుకొచ్చారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus