Naresh: సినిమానే నా మొదటి భార్య.. సినిమా కోసం ఏమైనా చేస్తా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నరేష్ ఎన్నో సినిమాలలో హీరోగా నటించడమే కాకుండా కీలక పాత్రలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న నరేష్ ప్రస్తుతం హీరోలకు తండ్రిగా ఎంతో అద్భుతంగా తండ్రి పాత్రలో ఒదిగిపోయి నటించారు. నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన నిత్యం ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో ఉంటారు. ఇకపోతే తాజాగా ఈయన వ్యక్తిగత జీవితం గురించి కూడా ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్ మూడు పెళ్లిళ్లు పెటాకులు కావడంతో నాలుగో పెళ్లికి సిద్ధమయ్యారు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ ముగ్గురికి విడాకులు ఇవ్వడానికి గల కారణం ఏమిటి అనే విషయం గురించి స్పందించి ఎమోషనల్ అయ్యారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయనకి సినిమా వాళ్ళు ఎందుకని ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటారనే ప్రశ్న అడగగా ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు సెలబ్రిటీలు కనుక వారికి సంబంధించిన విషయాలన్నీ బయటకు తెలుస్తాయి.

బయట వాళ్ళవి కనిపించవు అంతే అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో వివాహ వ్యవస్థ తప్పు అంటూ ఆయన పేర్కొన్నారు. పెళ్లయిన నెల రోజులకే భార్య భర్తలు విడిపోవాలని అనుకుంటున్నారని ఆయన వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారికి వృత్తిపరమైన జీవితంలో బిజీగా ఉండటం వల్ల వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించలేక పోతున్నారని తెలిపారు. తాను గతంలో నెలలో 28 రోజులు షూటింగ్ లో పాల్గొన్న సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తు చేసుకున్నారు.

అలాంటి సమయంలో నా వృత్తిపరమైన జీవితాన్ని అర్థం చేసుకునే వాళ్లే నాతో ఉంటారని,తన మూడు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ తనని ఎవరు అర్థం చేసుకోకపోవడం వల్లే విడాకులు ఇచ్చినట్లు ఆయన పరోక్షంగా వెల్లడించారు. సినిమానే తన మొదటి భార్య, సినిమా కోసం తాను ఏం చేయడానికైనా సిద్ధమేనని ఈ సందర్భంగా నరేష్ తన మూడు పెళ్లిళ్ల గురించి ఈ సందర్భంగా తెలియజేశారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus