పోకిరి, దూకుడు, బాహుబలి వంటి ఎన్నో తెలుగు చిత్రాల్లో విలక్షమైన పాత్రలు చేసి మెప్పించిన నటుడు నాజర్. ప్రస్తుతం “సంజె ముడి మచ్చ” అనే తమిళ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం ఓ అందమైన కొండ ప్రాంతానికి నాజర్ వెళ్లారు. అక్కడి ప్రకృతి చూసి ఆనందించారు. కానీ అక్కడ పగిలిన బీర్ బాటిల్స్ చూసి బాధ పడ్డారు. కొండ ప్రాంతాలపై ఆహారానికి వచ్చే జంతువులకు ఈ గాజు పలుకులు ఎంత హాని తలు పెడుతాయోనని ఆవేదన చెందారు.
ఇలాంటి పనులు ఎవరు చేయకుండా ఉండాలని తను సందేశం అందించారు. తాను మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “నేను మంచి కొండ ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా అక్కడ పగిలి ఉన్న బీర్ బాటిల్స్ గమనించాను. ప్రకృతి అందాలను చూస్తూ బీర్ తాగడంలో తప్పు లేదు. తాగిన తర్వాత ఆ బాటిల్స్ పగల గొట్టడం ఎందుకు? .. ఆ గాజు పెంకులు జంతువులకు, పిల్లలకు చాలా హాని కలిగిస్తాయి. సో అందుకే మీరు తాగిన తర్వాత ఆ బాటిల్స్ మీతో పాటే తీసుకెళ్లి అమ్మేయండి. డబ్బులు వస్తాయి. లేదంటే పగల కొట్టకుండా వదిలేయండి” అని నాజర్ ఆ వీడియో లో సూచించారు. ఈ సందేశం నెటిజనులు బాగా నచ్చింది. నాజర్ ని అభినందిస్తూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.