Nikhil Siddhartha: పెళ్లయిన నాలుగేళ్లకు గుడ్ న్యూస్…వార్తలలో నిజమెంత?

హ్యాపీడేస్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైనటువంటి నిఖిల్ మొదటి సినిమాతో తన నటన ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈయన తదుపరి వరస సినిమా అవకాశాలను అందుకొని కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా కార్తికేయ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నిఖిల్ త్వరలోనే స్వయంభు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. నికిల్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా నిఖిల్ కెరియర్ లోనే 20వ సినిమా కావటం విశేషం. ఇలా కెరియర్ పరంగా నిఖిల్ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇకపోతే ఈయన వ్యక్తిగత జీవితానికి వస్తే … పల్లవి వర్మ అనే అమ్మాయిని ఈయన ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.

2020వ సంవత్సరంలో వీరి వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. ఇక పల్లవి వర్మ వృత్తిపరంగా వైద్యురాలు అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా పెళ్లి తర్వాత నిఖిల్ తన వైవాహిక జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా నిఖిల్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పల్లవి వర్మ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని త్వరలోనే నిఖిల్ (Nikhil Siddhartha) తండ్రి కాబోతున్నారంటూ ఒక వార్త హల్చల్ చేస్తుంది.

ఇలా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పెళ్లైన నాలుగు సంవత్సరాలకు నిఖిల్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ విషయం గురించి ఎక్కడ కూడా నిఖిల్ అధికారికంగా ప్రకటన ఇవ్వలేదు కానీ గత కొద్ది రోజుల క్రితం ఈయన తన భార్యతో కలిసి వెకేషన్ కి వెళ్ళగా ఆ ఫోటోలలో పల్లవి బేబీ బంప్ తో కనిపించడంతో ఈమె ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus