Ponnambalam: తన జీవితంలో కష్టం గురించి చెప్పుకొచ్చిన స్టార్‌ విలన్‌ పొన్నాంబళం!

పొన్నాంబళం.. ఈ పేరు వినగానే ఓ గంభీరమైన రూపం గుర్తొస్తుంది. ఇప్పటితరం సినిమా ప్రేక్షకులకు ఆయన పెద్దగా తెలియదు కానీ.. గత తరం సినిమా ప్రేక్షకులకు ఆయను సుపరిచితమే. ఎంతో మంది స్టార్‌ హీరోలకు ఆయన విలన్‌గా నటించి మెప్పించారు. అలాంటి పొన్నాంబళం ఇటీవల తీవ్రంగా అనారోగ్యం పాలయ్యారు. దీంతో చిరంజీవిని సాయం అడిగారు. గతంలో ఆయన చిరంజీవి సినిమాల్లో చాలానే నటించారు. ఆ చనువుతో అడిగితే చిరు కూడా అంతే పెద్ద మనసుతో సాయం చేశారు. ఈ క్రమంలో పొన్నాంబళం మరో వైరల్‌ కామెంట్ చేశారు.

సొంత తమ్ముడే తనకు విషం పెట్టి చంపాలనుకున్నాడని పొన్నాంబళం సంచలన ఆరోపణలు చేశాడు. ఆస్తి కోసం అయినవాళ్లే తనని ఇబ్బందిపెట్టారన్న పొన్నాంబళం కిడ్నీ సంబంధిత సమస్య నుంచి ఇటీవలే కోలుకున్నానని చెప్పాడు. మద్యం తాగడం వల్లే నా కిడ్నీలు చెడిపోలేదు. అయినవాళ్లే నన్ను చంపాలని చూశారు అని చెప్పారు. నా తండ్రికి నలుగురు భార్యలు అని, మూడో భార్య కుమారుడిని నా సొంత తమ్ముడిగా భావించి మేనేజర్‌గా పెట్టుకున్నానని చెప్పాడు.

నా సినిమాల విషయాలన్నీ చూసుకుంటున్నాడని అతడిని ఎంతో నమ్మానని, అయితే అతను ఓసారి నేను తాగే బీర్‌లో ‘స్లో పాయిజన్‌’ కలిపాడని ఆరోపించాడు పొన్నాంబళం. అంతటితో ఆగకుండా విషం కలిపిన ఆహారాన్ని కూడా పెట్టేవాడని చెప్పాడు. దీంతో కొంతకాలానికి నా కిడ్నీలు దెబ్బతిన్నాయని పొన్నాంబళం వివరించాడు. వైద్యుల్ని సంప్రదిస్తే విష ప్రయోగం జరగడం వల్లే ఇలా అయ్యిందని చెప్పారని తెలిపాడు.

ఇక తన ఆరోగ్యం గురించి చెబుతూ చిరంజీవికి సమాచారం అందిస్తే.. ఆయన రూ.40 లక్షలు ఖర్చుతో వైద్యం చేయించారని పొన్నాంబళం తెలిపాడు. ఆయన లక్షో, రెండు లక్షలో ఇస్తారేమో అనుకున్నానని కానీ ఆయన అంత మొత్తం నా కోసం ఖర్చు చేయడం ఎంతో గొప్ప విషయమని పొన్నాంబళం చెప్పుకొచ్చాడు. చిరంజీవి చేసిన పనిని ఇప్పుడు అభిమానులు, నెటిజన్లు ఘనంగా చెప్పుకుంటున్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus