ప్రసాద్ బెహరా (Prasad Behara) అందరికీ సుపరిచితమే. యూట్యూబ్లో పలు షార్ట్ ఫిలిమ్స్ తో బాగా పాపులర్ అయ్యాడు. ‘పెళ్ళివారమండి’ వెబ్ సిరీస్ తో ఇతనికి బోలెడంత మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు. దీంతో ‘కమిటీ కుర్రోళ్ళు’ అనే సినిమాలో ఇతనికి ముఖ్య పాత్ర లభించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇతనికి వరుస సినిమాల్లో ఛాన్సులు లభించాయి. ఈ శుక్రవారం అంటే డిసెంబర్ 20న విడుదల కాబోతున్న ‘బచ్చల మల్లి’ సినిమాలో కూడా ముఖ్య పాత్ర పోషించాడు.
ఇలాంటి టైంలో అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. నటుడు ప్రసాద్ బెహరా (Prasad Behara) హరాస్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యాడు. కంచన్ బామ్నె అనే అమ్మాయి ఇతనిపై పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేసింది. ఆమె కంప్లైంట్ ను స్వీకరించిన పోలీసులు వెంటనే ప్రసాద్ బెహరాని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. తర్వాత ఇతనికి 14 రోజులు రిమాండ్ విధించారట.
జూబ్లీ హిల్స్ లోని సైలెంట్ వాలీ హిల్స్ వద్ద షూటింగ్ జరుగుతున్న టైంలో కంచన్ బామ్నెని క్రూ అందరి ముందు ఆమె వెనుక భాగంపై(పిరుదుల భాగం) కొట్టాడట. దీంతో ఆమెకు కోపం వచ్చింది. ‘నన్ను ఎందుకు కొట్టావ్’ అని ఆ అమ్మాయి ప్రశ్నించగా.. అందుకు ప్రసాద్ బెహరా (Prasad Behara) కామెడీ చేశాడట.
అది ఆ అమ్మాయికి నచ్చకపోవడంతో ‘నీపై పోలీస్ కంప్లైంట్ ఇస్తా’ అంటూ ఆ అమ్మాయి వార్నింగ్ ఇచ్చిందట. అయినా అతను తగ్గకుండా ‘కంప్లైంట్ ఇస్తే ఇచ్చుకో..దెం*య్’ అంటూ దారుణంగా మాట్లాడాడట. అతని దురుసు ప్రవర్తన కారణంగానే ఆమె జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కినట్టు సమాచారం.