రాజీవ్ కనకాల(Rajeev Kanakala).. సీనియర్ నటుడు, విలక్షణ నటుడిగా పాపులర్ అయ్యాడు. అయితే సోషల్ మీడియా బ్యాచ్ రాజీవ్ కనకాల..ని చూసే తీరు వేరు. అవును.. రాజీవ్ కనకాల ఏ సినిమాలో నటించినా.. చనిపోయే పాత్రే చేస్తాడు? అనేది వారి నమ్మకం. కావాలనే రాజీవ్ కనకాల అలాంటి పాత్రలు ఎంపిక చేసుకుంటాడా? లేక చనిపోయే పాత్రల కోసం దర్శకులు రాజీవ్ కనకాలని తీసుకుంటారా? వంటి ప్రశ్నలు కూడా అందరిలోనూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో రాజీవ్ కనకాల బ్రతికున్న పాత్రలు చేసింది చాలా తక్కువ.
Karthik Varma
ఒకవేళ బ్రతికున్నా ఆ పాత్రకి సినిమాలో పెద్దగా ప్రాముఖ్యత ఉండదు అని అంతా భావిస్తుంటారు. కేవలం రాజమౌళి (S. S. Rajamouli) సినిమాల్లోనే రాజీవ్ కనకాల బ్రతికుండే పాత్రలు చేస్తాడు? అనే నమ్మకం కూడా సోషల్ మీడియా బ్యాచ్ కి ఉంది. సరే.. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఈ మధ్య కాలంలో రాజీవ్ కనకాల పాత్ర బ్రతికుండటం, అలాగే ఆ పాత్రకి ప్రాముఖ్యత ఉండటం అనేది ‘విరూపాక్ష’ లోనే చూశాం. ఇదంతా ఎందుకు చెబుతున్నాం అంటే..
ఈరోజు బచ్చల మల్లి (Bachhala Malli) ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికి ‘విరూపాక్ష’ (Virupaksha) దర్శకుడు కార్తీక్ దండు (Karthik Varma Dandu), ‘బింబిసార’ (Bimbisara) దర్శకుడు మల్లిడి వశిష్ట్ (Mallidi Vasishta) హాజరయ్యారు. వీళ్ళ పేర్లు సుమ (Suma) కన్ఫ్యూజ్ అయ్యింది. దీంతో ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ దండు ఫన్నీ కామెంట్స్ చేశాడు. ‘ఈ మధ్య కాలంలో మీ భర్త రాజీవ్ కనకాలకి బ్రతికున్న పాత్ర ఇచ్చింది నేనే. మీకు ఆ మమకారం కూడా లేదు’ అంటూ దర్శకుడు కార్తీక్ దండు .. సుమపై ఫన్నీ సెటైర్లు వేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది.