Premgi: విజయ్ ముఖ్యమంత్రి కావడం పక్కా.. జోస్యం చెప్పిన ప్రముఖ నటుడు!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్  (Thalapathy Vijay)  హీరోగా వెంకట్ ప్రభు  (Venkat Prabhu)  డైరెక్షన్ లో తెరకెక్కిన ది గోట్ (The Greatest of All Time)  సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో థియేటర్లలో విడుదల కాగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వస్తోంది. భారీ అంచనాలతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులను ఈ సినిమా నిరాశకు గురి చేయడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు విజయ్ తన పొలిటికల్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. త్వరలో విజయ్ పూర్తిస్థాయి రాజకీయాలతో బిజీ కానున్నారు.

Premgi

భవిష్యత్తులో సీఎం కావడమే లక్ష్యంగా విజయ్ అడుగులు పడనున్నాయి. అయితే విజయ్ తప్పకుండా సీఎం అవుతారంటూ కోలీవుడ్ ప్రముఖ నటుడు ప్రేమ్ గీ అమరేన్ (Premgi) కామెంట్లు చేశారు. 2026 ఎన్నికల్లో దళపతి విజయ్ సీఎం కావడం పక్కా అని ఆయన తెలిపారు. నా ఓటు కూడా విజయ్ కే వేస్తానని ఆయన అన్నారు. 2026 సంవత్సరంలో విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం పక్కా అని హామీ ఇస్తున్నానని ప్రేమ్ గీ అమరేన్ (Premgi) అభిప్రాయపడ్డారు.

ది గోట్ సినిమాలో స్నేహకు (Sneha) సోదరుని పాత్రలో ప్రేమ్ గీ అమరేన్ (Premgi Amaren) నటించడం జరిగింది. ది గోట్ మూవీ విజయ్ అభిమానులకు నచ్చే విధంగా ఇతర ప్రేక్షకులను మాత్రం మెప్పించే విధంగా లేకపోవడం గమనార్హం. విజయ్ ఈ సినిమాకు ఏకంగా 220 కోట్ల రూపాయల రేంజ్ లో తీసుకున్నారని తెలుస్తోంది. విజయ్ త్వరలో సినిమాలకు గుడ్ బై చెబుతున్న నేపథ్యంలో కథల ఎంపికలో ఎన్నో పొరపాట్లు చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

విజయ్ తర్వాత సినిమాతో అయినా సక్సెస్ అందుకుంటారో లేదో చూడాలి. వారసుడు, లియో సినిమాలు సక్సెస్ సాధించినా ఈ సినిమాల కథ, కథనాల విషయంలో కొన్ని విమర్శలు వచ్చాయి. విజయ్ పాలిటిక్స్ లో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.

తల గోడకు కొట్టుకొని ఏడవాలనిపించేది.. స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus