Racha Ravi: నేను క్షేమంగానే ఉన్నాను ఎలాంటి ప్రమాదం జరగలేదు: రచ్చ రవి

గత రెండు రోజులుగా ఇండస్ట్రీలో తీవ్ర విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలా ఇండస్ట్రీలో నిన్న ఒక్కరోజే సీనియర్ నటి జమున డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ మూర్తి మరణించారు. అదేవిధంగా జనవరి 26న యాంకర్ విష్ణు ప్రియ తల్లి మరణించడంతో ఈ విషయాన్ని ఈమె నిన్న సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇలా ఒక రోజులోనే ఇండస్ట్రీలో ఇన్ని విషాదాలు చోటుచేసుకున్నాయి. ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రచ్చ రవి కూడా ప్రమాదానికి గురయ్యారంటూ పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి.

రచ్చ రవి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై రచ్చరవి స్పందించారు. తన గురించి వస్తున్నటువంటి వార్తలు పూర్తిగా ఆవాస్తవమని తాను క్షేమంగా ఉన్నానని ఈయన క్లారిటీ ఇచ్చారు. ఇలా రచ్చ రవి తన గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందించారు. అయితే ప్రమాదానికి గురైనది రచ్చ రవి కాదని జోష్ రవి అని తెలుస్తుంది. ఈయన జనవరి 26న విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో ఈయన కారు ప్రమాదానికి గురైంది.

ఈ ప్రమాదంలో భాగంగా జోష్ రవికి స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే ఈయన పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డారని తెలుస్తోంది. ఇలా జోష్ రవి కారు ప్రమాదానికి గురి కావడంతో అందరూ రచ్చ రవి కారు ప్రమాదానికి గురైంది అంటూ తప్పుడు వార్తలను సృష్టించారు. దీంతో రచ్చ రవి ఈ వార్తలపై స్పందిస్తూ తాను క్షేమంగా ఉన్నానని వెల్లడించారు.

ఇక జోష్ రవి సైతం జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈయన గుండెజారి గల్లంతయింది సినిమాలో అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. అయితే ఈ ప్రమాదం నుంచి ఈయన బయటపడటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus