తండ్రి కాబోతున్న రాహుల్ రామకృష్ణ… లిటిల్ ఫ్రెండ్ కి హాయ్ చెప్పాలంటూ..!

టాలీవుడ్ స్టార్ కమెడియన్, విలక్షణ నటుడు అయిన రాహుల్ రామకృష్ణ త్వరలో తండ్రి కాబోతున్నాడా.? అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. ఈ విషయాన్ని పరోక్షంగా రాహుల్ రామకృష్ణ తెలిపాడు. తన భార్య బేబీ బంప్ ను చూపిస్తూ ఓ ఫోటోని తీసి.. నా లిటిల్ ఫ్రెండ్ కి హాయ్ చెప్పండి’ అంటూ రాహుల్ రామకృష్ణ ఓ ట్వీట్ పెట్టాడు.వారి జీవితాల్లోకి ఆనందం రాబోతోందని, త్వరలోనే తాను తండ్రిని కాబోతోన్నట్టుగా ఇలా వెరైటీగా తెలియజేశాడు.

దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. రాహుల్ రామకృష్ణ అభిమానులు, ఫాలోవర్స్ అంతా అతనికి కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. ఈ మధ్యనే రాహుల్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే గతంలో ఇతనికి ఓ లవ్ స్టోరీ ఉండేదని ప్రచారం జరిగింది.గతంలో రాహుల్ రామకృష్ణ ఓ అమ్మాయితో తెగ తిరిగాడు. కానీ ఆ అమ్మాయితో బ్రేకప్ చెప్పేసి 3 ఏళ్ళు సింగిల్ గా ఉన్నాడు. అయితే ఈ ఏడాది పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో ను ఎంజాయ్ చేస్తున్నాడు రాహుల్.

మొన్నామధ్య తన భార్య ఫోటోని షేర్ చేసి ‘తను వెజిటేరియన్ అయినప్పటికీ నా కోసం యూట్యూబ్ లో చూసి మరీ పాయ చేసి పెడుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాహుల్ రామకృష్ణ.. విభిన్న పద్ధతిలో ట్వీట్లు వేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు.

‘నెట్’ సినిమా ప్రమోషన్ల టైంలో ఇతను వేసిన ట్వీట్ ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసే ఉంటుంది. అలాగే అతను అభిమానులతో చాట్ చేసినప్పుడు.. ‘తాగి ట్వీట్లు వేస్తావా?’ అని అడిగితే ‘అప్పుడప్పుడు’ అంటూ సమాధానం ఇచ్చిన సంగతి కూడా అందరికీ తెలిసే ఉంటుంది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus