Rajendra Prasad: నా కూతురిలో అమ్మని చూసుకున్నాను.. కూతురు కూడా వదిలి వెళ్ళిపోయింది!

వెండి తెరపై నటకిరీటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ఈయన ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఎంతో మంది హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రలలో నటిస్తూ రాజేంద్రప్రసాద్ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇలా వెండితెరపై తన మాట తీరుతో అందరిని నవ్వించే రాజేంద్రప్రసాద్ నిజజీవితంలో విషాదం ఉందని చెప్పాలి.

రాజేంద్రప్రసాద్ గతంలో ఒక సినిమా వేడుకలో పాల్గొన్నారు. రాజేంద్రప్రసాద్ బేవార్స్ సినిమా వేడుకలో భాగంగా పాల్గొంటూ తన తల్లిని తన కూతురి గురించి గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమాలో సుద్దాల అశోక్ తేజ తల్లి గురించి ఓ అద్భుతమైన పాట అందించారు. ఇక ఈ పాట గురించి ఈయన మాట్లాడుతూ తల్లి లేని వాడు తన కూతురిలో తన తల్లిని చూసుకుంటుంది. నేను పది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నా తల్లిని కోల్పోయాను.

తల్లిని కోల్పోయిన నేను తన తల్లిని తన కూతురిలో చూసుకున్నానని తెలిపారు. ఇలా తన కూతురిలో తల్లిని చూసుకుంటూ ఉండగా తన కూతురు కూడా తాను ప్రేమించిన వారీతో వెళ్లిపోయి తనని ఒంటరిని చేసిందని రాజేంద్రప్రసాద్ ఎమోషనల్ అయ్యారు. ఇలా తన కూతురితో తనకు మాటలు లేవని ఈయన ఎమోషనల్ అయ్యారు.ఇక ఈ సినిమాలో తల్లిపాటను తన కుమార్తెకు చాలా సార్లు గెలిపించాలని ఈ సందర్భంగా తన కూతుర్ని తలుచుకొని రాజేంద్రప్రసాద్ ఎమోషనల్ అయ్యారు

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus