Actor Rao Ramesh: 10 లక్షల ఆర్థిక సహాయం మేకప్ మెన్ కుటుంబానికి అండగా రావు రమేష్!

అలనాటి లెజెండరీ యాక్టర్ రావు గోపాల్ రావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు రావు రమేష్. ఈయన తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తండ్రికి తగ్గ వారసుడిగా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్న ఈయన ఎన్నో సినిమాలలో తండ్రి పాత్రలలోనూ విలన్ పాత్రలలోనూ నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ విధంగా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి నటుడు రావు రమేష్ పర్సనల్ మేకప్ మెన్ బాబు మృతి చెందారు.

ఈ విధంగా పర్సనల్ మేకప్ మెన్ మృతి చెందడంతో వారి కుటుంబానికి రావు రమేష్ ఎంతో అండగా నిలిచారు. ఇన్ని రోజులపాటు తనకు ఎన్నో సేవలు చేసిన బాబు మృతి చెందడంతో రావు రమేష్ విచారం వ్యక్తం చేయగా బాబు కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే రావు రమేష్ స్వయంగా తన ఇంటికి వెళ్లి బాబు కుటుంబ సభ్యులను ఓదార్చడమే కాకుండా వారికి అండగా ఉంటానని భరోసా కల్పించారు.

అలాగే బాబు కుటుంబానికి ఈయన 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది నెటిజన్ లు రావు రమేష్ మంచి మనసుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ విధంగా రావు రమేష్ అందించిన పది లక్షలు ప్రస్తుతం ఆ కుటుంబానికి ఎంతో అండగా ఉంటాయని చెప్పాలి.

మొత్తానికి సినిమాలలో విలన్ పాత్రలలో కనిపించినప్పటికీ ఈయన మనస్సు కూడా ఎంతో మంచిదంటూ నేటిజన్స్ ఈయనను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక రావు రమేష్ ఇండస్ట్రీలోకి సీమ సింహం అనే సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చి అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకుని ఇండస్ట్రీలో బిజీగా మారిపోయారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus