నిర్మాతలను నమ్మి లక్షల్లో నష్టపోయిన నటుడు?

ప్రముఖ గాయకుడు రామకృష్ణ కుమారుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటుడు సాయి కిరణ్.ఈయన నువ్వే కావాలి సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని అనంతరం ఇండస్ట్రీలో పలు సినిమాలలో హీరోగా నటించారు. ఈ విధంగా హీరోగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న సాయికిరణ్ ప్రస్తుతం వెండితెరకు దూరం అయినప్పటికీ బుల్లితెర సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను తనదైన శైలిలో సందడి చేస్తున్నారు. ఈ విధంగా బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్న సాయికిరణ్ దారుణంగా మోసపోయినట్లు ఈయన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.

నిర్మాత జాన్‌బాబు, లివింగ్‌ స్టన్‌లపూ తన దగ్గర రూ.10.6 లక్షలు అప్పుగా తీసుకున్నారని, తిరిగి తన డబ్బులు ఇవ్వమని అడిగితే తనకు డబ్బులు వెనక్కి ఇవ్వక పోవడమే కాకుండా తనని బెదిరిస్తున్నారని ఈయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విధంగా నటుడు సాయి కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు జాన్‌బాబు, లివింగ్‌ స్టన్‌లపూ లపై 420,406 సెక్షన్ల కింద కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే నాలుగు రోజుల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విధంగా ఈయన వారిని నమ్మి డబ్బు అప్పు ఇవ్వడమే కాకుండా తీవ్రంగా నష్టపోయారని తనకు న్యాయం కావాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఇక ప్రస్తుతం సాయికిరణ్ పలు ఇతర సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ సీరియల్స్ లో నటిస్తున్నారు.

తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న ఈయన పలు దేవుళ్ళ పాత్రలలో కూడా నటించి మెప్పించారు. ఇదివరకే వెంకటేశ్వరస్వామి విష్ణుదేవుడు వంటి పాత్రలో కూడా సాయికిరణ్ ఎంతో అద్భుతంగా నటించారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus