సీనియర్ నటుడు శరత్ బాబు ఈరోజు కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. కిడ్నీ ఫెయిల్యూర్, బ్లడ్ ఇన్ఫెక్షన్ తో హాస్పిటల్ లో అడ్మిట్ అయిన శరత్ బాబు… బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా మెరుగైన వైద్యం కోసం ఆయన్ని హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఈరోజు మరణించారు. ఈ విషయాన్ని వైద్య సిబ్బంది వెల్లడించింది. ఇక శరత్ బాబు మరణవార్తతో టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ సెలబ్రిటీలు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇక శరత్ బాబు (Sarath Babu) రామరాజ్యం సినిమా ద్వారా 1973 సంవత్సరంలో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన కెరీర్లో దాదాపు 250కి పైగా సినిమాల్లో నటించారు. నరేష్, పవిత్ర నటించిన ‘మళ్ళీ పెళ్లి’ శరత్ బాబు నటించిన చివరి చిత్రం. ఇందులో దివంగత స్టార్ హీరో కృష్ణ పాత్రలో ఆయన కనిపించారు.
అయితే శరత్ బాబు (Sharath Babu) చెప్పిన చివరి డైలాగ్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ‘వకీల్ సాబ్’ డిసిప్లిన్ కమిటీ చైర్మన్ గా ఆయన నటించారు. ఈ సినిమాలో లాయర్ సత్యదేవ్(పవన్ కళ్యాణ్) కు మద్దతు పలుకుతూ ఆయన చెప్పిన డైలాగులు ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించాయి. ‘ఆవేదన నుంచి పుట్టిన ఆవేశం. ఇట్స్ నాట్ యువర్ వీక్ నెస్, ఇట్స్ ఎ వెపన్.. జాగ్రత్తగా యూజ్ చెయ్..
నీ ఆవేశం కన్నా నీ ఆశయం చాలా గొప్పది.. ఆల్ ది బెస్ట్’ ‘ఇప్పుడు జనాలకు నువ్వు కావాలి’ అంటూ చెప్పిన డైలాగులు.. చివరికి హీరో.. కోర్టులో కేసు గెలిచేలా చేస్తాయి. అంతేకాకుండా పవన్ రాజకీయ భవిష్యత్తుకి కూడా ఇది మంచి మైలేజ్ ఇచ్చే డైలాగ్ అని కూడా చెప్పాలి.
బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!
అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు