జిమ్ చేస్తూ మరణించిన నటుడు అనగానే అందరికీ కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గుర్తుకొస్తాడు. ఎంతో ఫిట్ గా ఉన్నప్పటికీ.. అతను చిన్న వయసులోనే మరణించడానికి కారణం మితిమీరిన వర్కౌట్లు కారణం అని వైద్యులు తెలిపారు. ఆ తర్వాత కొన్నాళ్లకు హీరో చియాన్ విక్రమ్ కూడా జిమ్ చేస్తూ ఛాతి నొప్పికి గురయ్యి కుప్పకూలారు. ఇప్పుడు మరో నటుడు కూడా జిమ్ చేస్తూ మరణించాడు. చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మరో నటుడు జిమ్ లో వర్కౌట్లు చేస్తూ మరణించడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది అనే చెప్పాలి.
వివరాల్లోకి వెళితే.. తాజాగా బాలీవుడ్ నటుడు సిద్దాంత్ వీర్ సూర్యవంశీ జిమ్‌లో కఠినమైన వర్కౌట్లు చేస్తూ కుప్పకూలిపోయాడు. ఇతని వయసు కూడా పునీత్ లానే కేవలం 46 ఏళ్ళు. కుసుమ్ వారిస్, సూర్య పుత్ర్ కర్ణ సీరియల్స్‌తో ఇతను బాగా పాపులర్ అయ్యాడు. సాఫీగా సాగుతున్న అతని కెరీర్ ఒక్క సారిగా ముగిసిపోయింది. సిద్దార్థ్ శుక్లా, పునీత్ రాజ్ కుమార్ ఇలా ఎంతో మంది జిమ్‌లో వర్కవుట్లు చేస్తూనే మరణించిన సంగతి తెలిసిందే.
సిద్ధార్థ్ భార్య పేరు ఇరా. అయితే 2015లో ఆమెతో విడాకులు తీసుకున్నాడు. ఈ దంపతులకు ఓ పాప కూడా ఉంది.ఇక 2017 లో ఇతను అలీసియాని పెళ్లి చేసుకున్నాడు. అలీసియా- సిద్దాంత్ లకు ఓ బాబు ఉన్నాడు. సిద్ధార్థ్ ఇంత చిన్న వయసులో మరణించడం పట్ల బాలీవుడ్లో విషాద ఛాయలు అల్లుకున్నాయి.
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!