Siva Balaji: ప్రేమించి పెళ్లి చేసుకున్న చివరికి విడాకులకు సిద్ధమయ్యాము!

ఎన్నో సినిమాలలో సెకండ్ హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శివ బాలాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నటువంటి నటి మధుమితను ప్రేమించి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులు ఇద్దరు పిల్లలతో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇలా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి శివ బాలాజీ ఇప్పటికి పలు సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తుండగా మధుమిత మాత్రం ఇండస్ట్రీకి కాస్త దూరమయ్యారు.

ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె తన భర్త శివ బాలాజీతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె తన పెళ్లి గురించి పెళ్లిలో ఏర్పడిన అడ్డంకులు పెళ్లి తర్వాత తన జీవితం గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. నాలుగు సంవత్సరాల పాటు ప్రేమించుకున్నామని అయితే శివ బాలాజీ తల్లి జాతకాలు కుదరలేదని మా పెళ్లి క్యాన్సిల్ చేయడంతో చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని తెలిపారు.

అయితే తర్వాత రెండు సంవత్సరాలకు మా పెళ్లి జరిగిందని మధుమిత తెలిపారు. పెళ్లి అంటే సులభైనది కాదని ఎంతో కష్టమైన అంశం అంటూ ఈమె తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో శివ బాలాజీ కూడా మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు. ప్రేమించుకునే సమయంలో మేము దూరంగా ఉండటం వల్ల ఒకరిపై ఒకరికి ఎంతో ప్రేమ ఉండేది కానీ పెళ్లి చేసుకుని ఇద్దరు ఒకే చోట ఉండటం వల్ల మా ఆలోచనలలో అభిప్రాయాలు వచ్చాయి.

ఇలా మా మధ్య వచ్చిన అభిప్రాయ బేధాల వల్ల చివరికి విడాకులు తీసుకోవాలని కూడా నిర్ణయించుకున్నామని శివబాలాజీ తెలిపారు. అప్పటికే మాకు ఒక బాబు కూడా పుట్టారని బాబు పుట్టిన తర్వాత కూడా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. అయితే మా కజిన్ కొద్దిరోజులు మమ్మల్ని దూరంగా పెట్టడంతో ఇద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ తెలిసి కలిసిపోయామని శివబాలాజీ (Siva Balaji)  తెలిపారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus