Sivaji Raja: సీనియర్ నటుడిపై శివాజీ రాజా షాకింగ్ కామెంట్స్.. ఆ నటుడు ఎవరంటే..?

సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు మీడియా ముందు ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం అనేది కామన్.. ప్రొఫెషన్, పర్సనల్ విషయాల గురించి బహిరంగంగా మాట్లాడడం, కాంట్రవర్సీల్లో ఇరుక్కోవడం లాంటివి జరుగుతుంటాయి.. అయితే కొంతమంది మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తుంటారు.. కర్ర విరగకూడదు..పాము చావకూడదు అన్న చందాన డైరెక్ట్‌గా అనకపోయినా కానీ ఎవర్ని ఉద్దేశించి అంటున్నారో హింట్ ఇస్తుంటారు. ఇప్పుడు సీనియర్ యాక్టర్, ‘మా’ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ శివాజీ రాజా, మరో నటుడి మీద చేసిన షాకింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..

రీసెంట్‌గా ఓ యూట్యూబ్ ఛానల్‌కిచ్చిన ఇంటర్వూలో శివాజీ రాజా.. ‘ నేనెప్పుడూ ఇండస్ట్రీలో ఎవరికీ భయపడలేదు.. తప్పుడు నా కొడుకులు భయపడాలి కానీ, నేనెందుకు భయపడాలి?’ అంటూ తన మనసులో ఓ వ్యక్తి మీద ఉన్న కోపాన్నంతా వెళ్లగక్కారు. కానీ, అతని పేరు మాత్రం బయట పెట్టలేదు.. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. “నన్ను ఇండస్ట్రీలో ఓ మాట అనేవారు లేరు. ఎందుకంటే నేను తప్పు చేయను. షూటింగ్‌కి లేటుగా వెళ్లను. ఇంకొకడి క్యారెక్టర్స్ కొట్టేయ్యను. ఎవరి కాళ్లా వేళ్లా పడను. నాకొచ్చిన క్యారెక్టర్స్ చేస్తా, లేదంటే కామ్‌గా కూర్చుంటా.

ఈ మాటలు ఎందుకు అన్నానంటే.. ఒకడికి తగలాలి. ‘ఈ దెబ్బ వీడు నా గురించే అన్నాడ’ని ఒకడికి తెలియాలి. అందుకే చెబుతున్నాను.. ఒరేయ్ నీలాంటి బొగడా గాళ్ళను చాలామందిని చూశా.. బ్యాగ్రౌండ్స్ తెలియకుండా మాట్లాడుతున్నావ్ నువ్వు.. వాడెవడో పేర్లు అవసరం లేదు. కానీ.. నా మాటలు విని, వాడు నా గురించే అన్నాడని నవ్వుకుంటాడు” అన్నారు. దీంతో యాంకర్.. ‘ఆ వ్యక్తి గొప్పవాడేనా?’ అని అడగ్గా..

‘‘వాడంతా గొప్పోడేమీ కాదు.. అందుకే మేటర్ ఇంకా లాగలేదు. ఈ ముప్ఫై ఏళ్లలో ఎంతోమంది వెధవలను చూశాను. ఎన్నో డక్కా మొక్కీలు తింటే గాని ఈ స్టేజీకి వస్తాను. లైఫ్‌లో చాలామంది వెధవలు మన పక్కనే ఉంటారు. మనం ఓడిపోతే పక్కోడి టీమ్‌లో చేరి డ్యాన్స్ చేస్తుంటారు’’ అని చెప్పారు.. దీంతో ఇటీవల వివాదాల్లో ఇరుకున్న సీనియర్ నటుడి గురించేనా శివాజీ రాజా చెప్పింది? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus