Sriya Reddy: విశాల్ వదిన శ్రియా రెడ్డి ఫిట్‌నెస్ చూస్తే వావ్ అనాల్సిందే.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

నటి శ్రియా రెడ్డి.. కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో విశాల్ అన్నయ్య, ప్రొడ్యూసర్ విక్రమ్ కృష్ణ భార్య.. ఆమె తండ్రి భరత్ రెడ్డి ఇండియన్ క్రికెటర్.. వికెట్ కీపర్‌గా 1978, 1981 మధ్య ఇండియా తరపున మ్యాచెస్ ఆడారు. చెన్నైలో పుట్టి పెరిగిన శ్రియా.. అప్పట్లో పాపులర్ అయిన ఎస్ఎస్ మ్యూజిక్ ఛానెల్‌లో వీజేగా కెరీర్ స్టార్ట్ చేసింది.. 2002లో చియాన్ విక్రమ్ నటించిన తమిళ్ మూవీ ‘సమురాయ్’ లో స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చింది. ఇదే తన ఫస్ట్ ఫిలిం..

రాజాతో చంద్ర సిద్దార్థ్ తీసిన ‘అప్పుడప్పుడు’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. శర్వానంద్ ‘అమ్మచెప్పింది’ లోనూ నటించింది.. మరిది విశాల్‌తో (పెళ్లికి ముందు) ‘పొగరు’ మూవీలో నెగిటివ్ క్యారెక్టర్‌లో అదరగొట్టేసింది. తమిళ్, తెలుగు, ఇంగ్లీష్, మలయాళం భాషల్లో నటించింది. 2008లో విక్రమ్ కృష్ణతో పెళ్లి తర్వాత కెరీర్ పక్కన పెట్టేసింది. శ్రియాకి అమలియ అనే పాప ఉంది. 2018లో తమిళ్‌లో రీ ఎంట్రీ ఇచ్చింది.

ఈమధ్య ‘సుడల్’ వెబ్ సిరీస్‌లో ఇన్‌స్పెక్టర్ రెజీనా పాత్రలో మెప్పించింది. ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యతనిచ్చే శ్రియా తన వర్కౌట్స్‌కి సంబంధించిన పిక్స్, వీడియోస్ షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.


2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus