Suman, Venkatesh: ఆ విషయం తెలిసి షాకయ్యానన్న సుమన్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న అతి కొద్దిమంది హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. గత కొన్నేళ్లుగా వెంకటేష్ నటించిన సినిమాలలో ఏ సినిమా ప్రేక్షకులను నిరాశపరచలేదు. గతేడాది నారప్ప, దృశ్యం2 సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న వెంకటేష్ ఈ ఏడాది ఎఫ్3 సినిమాతో మరో సక్సెస్ ను అందుకున్నారు. ఎఫ్3 సినిమాలో వెంకటేష్ తనకు మాత్రమే సొంతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. వీక్ డేస్ లో కూడా ఈ సినిమా స్ట్రాంగ్ గా ఉండటంతో వెంకటేష్, వరుణ్ తేజ్ అభిమానులు సంతోషిస్తున్నారు.

అయితే ప్రముఖ నటుడు సుమన్ తాజాగా వెంకటేష్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుమన్ హీరోగా నటించిన చిన్నల్లుడు సినిమాలోని కుర్రాడు బాబోయ్ సాంగ్ కు ఎఫ్3 మూవీలో వెంకటేష్ అదిరిపోయే స్టెప్పులు వేశారనే సంగతి తెలిసిందే. ఎఫ్3 సినిమాలో ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఎఫ్3 సినిమాలో తన సినిమా పాట ఉండటం గురించి సుమన్ స్పందిస్తూ సాధారణంగా హీరోల మధ్య ఈగోలు ఉంటాయని వెంకటేష్ కు మాత్రం ఈగో ఉండదని ఆయన అన్నారు.

వెంకటేష్ మంచి మనిషని ఫ్లెక్సిబుల్ గా, ఓపెన్ గా ఉంటాడని సుమన్ అన్నారు. ఎఫ్3 సినిమాలో కుర్రాడు బాబోయ్ సాంగ్ కు విజిల్స్ వేసి ఎంజాయ్ చేస్తున్నారని తెలిసిందని ఎఫ్3 సినిమాను ఇంకా చూడలేదని సుమన్ కామెంట్లు చేశారు. తన పాటకు వెంకటేష్ స్టెప్పులు వేశాడని తెలిసి మొదట షాకయ్యానని సుమన్ తెలిపారు. వెంకటేష్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని తన పాటను గుర్తుకు తెచ్చినందుకు హ్యాపీగా ఉందని సుమన్ కామెంట్లు చేశారు.

ఇతర హీరోల నుంచి కూడా వెంకటేష్ కు ప్రశంసలు దక్కుతుండటంతో వెంకటేష్ అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. వెంకటేష్ మరెన్నో విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus