టాలీవుడ్ స్టార్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగాడు సునీల్. బ్రహ్మానందం, ఎమ్ ఎస్ నారాయణ వంటి బడా కమెడియన్లను సైతం డామినేట్ చేశాడు. ఆ స్టార్ల కంటే ఎక్కువగా సునీల్ పారితోషికం అందుకున్నాడు. కెరీర్ పీక్స్ లో ఉండగా అతను హీరోగా టర్న్ తీసుకున్నాడు. ఆ టైమ్ లో రెండు , మూడు హిట్లు పడగానే కమెడియన్ గా చేయడం మానేసాడు. ఆ తర్వాత హీరోగా చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు.
దీంతో కొన్నాళ్ల తర్వాత మళ్ళీ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఒకప్పటి ఆదరణ అయితే ప్రేక్షకుల నుండీ దక్కలేదు. అడపా దడపా సినిమాల్లో నటించినా మునుపటి జోష్ లో అయితే పాత్రలు రావడం లేదు.ఇలాంటి టైమ్ లో సునీల్ కి మంచి ఛాన్స్ లభించింది. తమిళంలో సునీల్ నటించిన జైలర్ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.
అందులో సునీల్ (Sunil) చేసిన బ్లాస్ట్ మోహన్ పాత్ర బాగా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా అది తమిళ ప్రేక్షకులకు బాగా నచ్చింది. దీంతో తమిళంలో సునీల్ కి మంచి ఆఫర్లు వస్తున్నాయి. జైలర్ కి ముందు సునీల్ అక్కడ మహావీరుడు అనే సినిమాలో కూడా నటించాడు. అది కూడా అక్కడ హిట్ అయ్యింది. ఇక లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోనీ లో కూడా సునీల్ నటించాడు.
ఇందులో అతను చేసిన పాత్ర కూడా తమిళ జనాలకి బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో అక్కడ సునీల్ పారితోషికం కూడా పెరిగింది. తెలుగు సినిమాలకు ఒక్కో రోజుకి గాను 25 వేలు పారితోషికం ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు తమిళంలో ఒక్కో రోజుకి గాను అతనికి రూ.50 వేలు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.
మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!