హీరో సురేష్ కొడుకు ప్రస్తుతం ఏం చేస్తున్నాడంటే.!

  • August 14, 2023 / 07:04 AM IST

కెరీర్ లో పెద్దగా హిట్స్ లేకపోయినా కూడా కొంతమంది హీరోలు ఎప్పటికీ మనకి అలా గుర్తుండిపోతారు. అద్భుతమైన రోల్స్ కూడా వేసి ఉండరు, చెప్పుకోదగ్గ సినిమాలు ఏమి ఉండవు, అయినా కూడా ఈ హీరోలు నేటి తరం ఆడియన్స్ కి కూడా సుపరిచితమే. అలాంటి హీరోలలో ఒకడు సురేష్. చూసేందుకు అందంగా, పర్వాలేదు అనే రేంజ్ నటన కనబరిచినప్పటికీ అప్పట్లో ఆయన కనీసం మీడియం రేంజ్ హీరో గా కూడా ఎదగలేకపొయ్యారు.

పన్నీర్ పుష్పాంగల్’ అనే తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి వచ్చిన ఈ హీరో, ఆ తర్వాత తెలుగు లో రామదండు అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఎక్కువ శాతం ఈయన 1990 వ సంవత్సరం వరకు తమిళ సినిమాలే చేసాడు. ఆ తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసాడు. కేవలం హీరో పాత్రలకు మాత్రమే కాకుండా, సురేష్ నెగటివ్ రోల్స్ కి కూడా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.

ఇకపోతే సురేష్ 1990 వ సంవత్సరం లో అనిత అనే అమ్మాయిని పెళ్లాడాడు. ఆ తర్వాత 5 ఏళ్లకే వీళ్లిద్దరు విడిపోవాల్సి వచ్చింది. వీళ్లిద్దరు విడిపోయినా కూడా ఇప్పటికీ ఎంతో స్నేహం గా ఉండడం విశేషం. ఇలాంటి సంఘటనలు సినిమాల్లో కూడా మనం చూసి ఉండం. ఇక ఆ తర్వాత కొన్నాళ్ళకు సురేష్ రాజేశ్వరి అనే అమ్మాయి ని ప్రేమించి పెళ్లాడాడు. ఈమె ఇండస్ట్రీ లో ఒక రచయితా గా పనిచేయడమే కాకుండా, ఒక నిర్మాతగా కూడా పలు సీరియల్స్ ని నిర్మిస్తూ ఉంటుంది.

ఇది ఇలా ఉండగా సురేష్ తన మొదటి భార్య అనిత తో నిఖిల్ అనే కుర్రాడికి జన్మనిచ్చాడు. నిఖిల్ చూసేందుకు తన తండ్రిలాగానే మంచి కటౌట్, మంచి అందగాడు అనే విషయం అర్థం అయిపోతుంది. కానీ అతగాడికి సినిమాల్లోకి రావడం ఏమాత్రం ఇష్టం లేదట. అమెరికా లో ఏం ఎస్ పూర్తి చేసి, అక్కడే సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి సంబంధించిన ఒక ఫోటో ని మీకోసం అందుబాటు లో ఉంచటం జరుగుతుంది.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus