సూర్య కుటుంబంలో విభేదాలకు ఆమె కారణమా?

తమిళ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తమిళ హీరో అయినప్పటికీ ఈయనకు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సూర్య సినిమాలన్నీ తెలుగులో కూడా డబ్ అయ్యి విడుదలవుతుంటాయి. ఇలా సూర్య సినిమాలకు ఆయనకు తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ అభిమానులు ఉన్నారని చెప్పాలి.

ఇలా నటుడిగా సూర్య ఈ స్థాయిలో ఉన్నారు అంటే అందుకు గల కారణం ఆయన నటన మాత్రమే కాదు మంచి మనసుతో ఆయన చేసే సేవలు కూడా కారణమని చెప్పాలి. సూర్య ఆగరం ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేద చిన్నారులను చేరదీసి వారి చదువులు వారి బాగోగులను చూసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా ఈయన తన తండ్రి సోదరుడితో కలిసి ఈ ఫౌండేషన్ ను ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు.

ఇలా కుటుంబంతో కలిసి ఎంతో సరదాగా,సంతోషంగా ఉండే సూర్య కుటుంబంలో గత కొంతకాలంగా విభేదాలు తల్లితాయని తెలుస్తోంది. ఇలా ఈ విభేదాల కారణంగానే ఆయన తన కుటుంబం నుంచి విడిపోయారని వార్త కోలీవుడ్ ఇండస్ట్రీలో కోడై కూస్తుంది.ఇలా సూర్య కుటుంబంలో విభేదాలు రావడానికి గల కారణం సూర్య భార్య జ్యోతిక అని సమాచారం. నిజానికి సూర్య జ్యోతికను పెళ్లి చేసుకోవడం సూర్య తండ్రి శివకుమార్ కు ఏ మాత్రం ఇష్టం లేదు. ఇష్టం లేకపోయినా తనని కోడలిగా అంగీకరించారు.

ఇలా పెళ్లి తర్వాత ఇంటిపట్టునే ఉన్నటువంటి జ్యోతిక తిరిగి సినిమాలలోకి రావడానికి ఇష్టపడకపోయినా శివకుమార్ ఈ విషయం గురించి తరచూ గొడవ చేస్తూ ఉన్నారట. ఇలా తన తండ్రి తన భార్య పట్ల గొడవ పడడంతో సూర్య తన ఫ్యామిలీతో పాటు వేరుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.ఇక సూర్య తన ఫ్యామిలీతో కలిసి ముంబైలో నివసించబోతున్నారని ఇప్పటికే ముంబైలో ఓ ఇంటిని కూడా కొనుగోలు చేశారని వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ వీటి గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఈ వార్త మాత్రం వైరల్ గా మారింది.

 

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus