2013లో వచ్చిన ‘రామాచారి’ చిత్రం తర్వాత వేణు తొట్టెంపూడి మరో సినిమాలో హీరోగా నటించలేదు. ‘తనని హీరోగా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయడం లేదు’… అనే నిజం చెప్పడం మానేసి బిజినెస్ వ్యవహారాల్లో బిజీ అయ్యాను అంటూ చెప్పుకొస్తున్నాడు వేణు. సరే ఆ విషయాలను పక్కన పెట్టేస్తే మొత్తానికి వేణు 9 ఏళ్ళ గ్యాప్ తర్వాత ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చాడు. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రానికి శరత్ మండవ దర్శకుడు.
రవితేజ చాలా మంది కొత్త దర్శకులను టాలీవుడ్ కు పరిచయం చేశాడు.ట్రైలర్ కూడా బాగుంది కాబట్టి శరత్ పై అంతా నమ్మకం పెట్టుకున్నారు. వేణు కూడా చాలా గ్యాప్ తర్వాత ఓ సినిమాలో సీఐ మురళి వంటి పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడు అంటే కచ్చితంగా సినిమాలోనూ, పాత్రలోనూ స్పెషాలిటీ ఉంది అని అంతా అనుకున్నారు. ఈ చిత్రం హిట్ అయితే వేణుకి మరిన్ని సినిమాల్లో అవకాశాలు లభిస్తాయి అని కూడా అంతా భావించారు. కానీ ఈ సినిమా ఆడియన్స్ ను బాగా డిజప్పాయింట్ చేసింది.
వేణు ఆశలపై నీళ్లు చల్లింది అనే చెప్పాలి. ‘అతని కెరీర్ సునీల్ కెరీర్ లా అయినా కొనసాగుతుందా?’ అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఓ రకంగా వేణు హ్యాట్రిక్ కొట్టాడు అనే కామెంట్లు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. అదెలా అనుకుంటున్నారా? క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వేణు నటించింది ఇది మూడో చిత్రం. ముందుగా వెంకటేష్ హీరోగా వచ్చిన ‘చింతకాయల రవి’ చిత్రంలో నటించాడు. ఆ సినిమా ప్లాప్ అయ్యింది. తర్వాత ఎన్టీఆర్- బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ‘దమ్ము’ లో నటించాడు.
అది కూడా పెద్దగా ఆడలేదు. పైగా ఆ సినిమాలో వేణు పాత్రకు కూడా విమర్శలు గుప్పించారు ప్రేక్షకులు. ఇక చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు చేసిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ కూడా వేణుని తీవ్రంగా నిరాశపరిచింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అతడు’ లో సోనూసూద్ పాత్రని ముందుగా తనకే వినిపించాడు అని వేణు చెప్పాడు. తన రీ ఎంట్రీ బాగుండాలి అంటే వేణు.. త్రివిక్రమ్ వంటి అగ్ర దర్శకుల మాటలు వినడం బెటర్ అని అంతా అభిప్రాయపడుతున్నారు.
Most Recommended Video
అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?