Yash: కేజిఎఫ్ చాప్టర్ 3 గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన యశ్!

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ప్రపంచం గర్వించే చిత్రంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సినిమా కేజిఎఫ్ గురించి అందరికీ తెలిసిందే. ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా వచ్చినటువంటి ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలైన అనంతరం చిత్ర పరిశ్రమ మొత్తం కన్నడ ఇండస్ట్రీ వైపు తొంగి చూసింది.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా కే జి ఎఫ్ చాప్టర్ 2 ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా ఏకంగా దేశవ్యాప్తంగా 1200 కోట్ల కలెక్షన్లను రాబట్టి అద్భుతమైన రికార్డులను సృష్టించింది.ఇలా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా ఈ సినిమా చివరిలో కేజిఎఫ్ చాప్టర్ 3 గురించి హింట్ ఇచ్చారు. ఈ విధంగా కే జి ఎఫ్ చాప్టర్ 3 గురించి క్లూ ఇవ్వడంతో ఈ సినిమా గురించి అభిమానులు పెద్ద ఎత్తున ఆత్రుత కనపరుస్తున్నారు.

ఇకపోతే కేజీఎఫ్ చాప్టర్ 3 తప్పకుండా ఉంటుందని చిత్ర బృందం వెల్లడించినప్పటికీ ఈ సినిమా ఇప్పుడప్పుడే ప్రేక్షకుల ముందుకు రాబోదని తెలియజేశారు.ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ హీరోగా చేస్తున్నటువంటి సలార్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్ సినిమాతో బిజీ కానున్నారు. ఈ క్రమంలోనే కే జి ఎఫ్ చాప్టర్ 3 మరింత ఆలస్యం కానుందని తెలుస్తుంది. ఇకపోతే తాజాగా ముంబైలో జరిగిన ఇండియా టూడే కాన్ క్లేవ్ కార్యక్రమంలో భాగంగా కేజీఎఫ్ 3 ప్రాజెక్ట్ పై స్పందించారు యశ్.

కే జి ఎఫ్ చాప్టర్ 3 గురించి వస్తున్న వార్తలను ఎవరు నమ్మకండి. ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదు. ప్రస్తుతంఈ సినిమా గురించి ఏ విధమైనటువంటి ఆలోచనలు చేయలేదని ఒకవేళ ఈ సినిమా గురించి ఏదైనా అప్డేట్ ఉంటే తానే వెల్లడిస్తానని తెలిపారు.త్వరలోనే తన తదుపరి సినిమాల గురించి అధికారికంగా ప్రకటించబోతున్నానని యష్ ఈ సందర్భంగా తెలియజేశారు.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus