Rambha, Vijay: విజయ్ ని కలిసిన రంభ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్.!

సీనియర్ స్టార్ హీరోయిన్ రంభ (Rambha) అందరికీ సుపరిచితమే. 1990 లలో తన అందంతో తెలుగు సినీ పరిశ్రమని ఓ ఊపు ఊపేసింది. అప్పట్లో గ్లామర్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అంటే రంభ పేరు ఎక్కువగా చెప్పేవారు. తెలుగుతో పాటు తమిళ,మలయాళ, కన్నడ సినిమాల్లో కూడా నటించింది రంభ. విజయవాడకు చెందిన రంభ అసలు పేరు విజయలక్ష్మి. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక రంభగా పేరు మార్చుకుంది. ఈవీవీ సత్యనారాయణ (E. V. V. Satyanarayana) గారి దర్శకత్వంలో వచ్చిన ‘ఆ ఒక్కటి అడక్కు’ ఈమె మొదటి సినిమా.

ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈమెకి వరుసగా పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కొన్నాళ్ల పాటు రంభ హవా నడిచింది. కానీ తర్వాత కొత్త హీరోయిన్ల ఎంట్రీతో ఈమెకు అవకాశాలు తగ్గాయి. దీంతో ఐటెం సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ తో కొన్నాళ్ళు కాలం గడిపింది. తర్వాత ఆ ఛాన్సులు కూడా కరువయ్యాయి. దీంతో 2010లో ఇంద్ర కుమార్ పద్మనాథన్ అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ దంపతులకి ఇద్ద‌రు అమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానం. కెనడాలో రంభ ఫ్యామిలీ సెటిల్ అయ్యింది. తాజాగా రంభ ఫ్యామిలీ విజయ్ ని (Vijay Thalapathy)Vijay Thalapathy కలవడం హాట్ టాపిక్ అయ్యింది. విజయ్ నెక్స్ట్ మూవీ ‘గోట్ (The Greatest of All Time) (గ్రేటెస్ట్‌ ఆఫ్ ఆల్ టైం)’ షూటింగ్ ప్రస్తుతం కెనడాలో జ‌రుగుతోంది. ఇది తెలుసుకున్న రంభ ఫ్యామిలీ వెళ్లి విజయ్ ని కలిసినట్టు స్పష్టమవుతుంది. అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus