‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో (Seethamma Vakitlo Sirimalle Chettu) మహేష్ బాబు (Mahesh Babu) , వెంకటేష్‌కు (Venkatesh) చెల్లిగా నటించి గుర్తింపు పొందిన అభినయకు (Abhinaya) సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మాట్లాడకపోయినా, వినబడకపోయినా కూడా ఆమె హావభావాలతో పాత్రలకు ప్రాణం పోస్తుంది. తమిళ్ తెలుగు ఇండస్ట్రీలలో ఆమెకు నటిగా మంచి గుర్తింపు ఉంది. ఇక ఇప్పుడు ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన గుడ్ న్యూస్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది. ఎంగేజ్‌మెంట్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, కొత్త జీవిత ప్రయాణం ప్రారంభమైందని తెలిపింది.
గుడిలో తన కాబోయే భర్తతో కలిసి గంట కొడుతున్న ఫోటోను షేర్ చేయగా, అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటికీ ఆమె జీవిత భాగస్వామి ఎవరనేది రివీల్ చేయలేదు. కొంతకాలం క్రితం అభినయ తన 15 ఏళ్ల లాంగ్‌టైమ్ రిలేషన్‌షిప్ గురించి బయటపెట్టిన సంగతి తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితుడితో ప్రేమలో ఉన్నానని, అతనినే పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పినా, అతని వివరాలను గోప్యంగా ఉంచింది.
దీంతో సోషల్ మీడియాలో అభిమానులు అతను ఎవరో కనుక్కోవాలని ట్రై చేస్తున్నారు. అయితే గతంలో తమిళ నటుడు విశాల్‌తో (Vishal ) అభినయ రిలేషన్‌లో ఉందన్న రూమర్లు వచ్చినా, అవన్నీ పుకార్లేనని క్లారిటీ ఇచ్చింది. విశాల్‌కు తనకు స్నేహం ఉన్నప్పటికీ, అది ప్రొఫెషనల్ రిలేషన్ మాత్రమే అని చెప్పింది. తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో విలక్షణమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను మెప్పించిన అభినయ, తన అసాధారణమైన ప్రతిభతో ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
కింగ్ (King), శంభో శివ శంభో (Sambho Siva Sambho), దమ్ము (Dammu), ధృవ (Druva), గామి (Gaami), ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. చెవుడు, మూగ అయినా కూడా తన అభినయంతో సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అందరికీ ఆశ్చర్యమే. ప్రస్తుతం ఆమె పోస్ట్ వైరల్ అవుతుండగా, ఫ్యాన్స్ మాత్రం ఆమె భర్త ఎవరో కనుక్కోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే పెళ్లికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.