గోపీచంద్ కి (Gopichand) మాస్లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికీ అతని సినిమా అంటే బి,సి సెంటర్ ఆడియన్స్ టికెట్ కొనుక్కుని థియేటర్ కి వెళ్లి చూస్తారు. కానీ గోపీచంద్ ఇమేజ్ ని మ్యానేజ్ చేస్తూ సినిమా చేసే దర్శకులు దొరకడం లేదు. ‘పక్కా కమర్షియల్’ (Pakka Commercial) ‘భీమా’ (Bhimaa) ‘విశ్వం’ (Viswam) వంటి సినిమాలకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ నెగిటివ్ టాక్ ఎఫెక్ట్ వల్ల.. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి. సో ఈసారి ఎలాగైనా ఒక హిట్టు కొట్టాలని గోపీచంద్ డిసైడ్ అయ్యాడు.
అందుకోసం పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో ఓ పోలీస్ స్టోరీ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘గోలీమార్’ కి (Golimaar) ఇది సీక్వెల్ అనే చర్చ నడిచింది. కానీ ఎందుకో ఈ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. మరోపక్క.. సంపత్ నంది (Sampath Nandi) దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని అనుకున్నాడు.’శ్రీనివాస సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాస ఈ సినిమాని నిర్మించాల్సి ఉంది.
ఇదే కాంబినేషన్లో ‘సీటీమార్’ (Seetimaarr) అనే సినిమా వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా బాగానే ఆడింది. అందుకే ఇదే కాంబోలో ఇంకో సినిమా రావడం గ్యారెంటీ అని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ ప్రాజెక్టు నుండి సంపత్ నంది తప్పుకోవడం జరిగింది. అతని ప్లేస్లో ‘ఘాజి’ (Ghazi) దర్శకుడు సంకల్ప్ రెడ్డి (Sankalp Reddy) వచ్చి చేరాడు.
‘అంతరిక్షం’ (Antariksham 9000 KMPH) తర్వాత సంకల్ప్ మరో సినిమా చేయలేదు. పైగా అతను ఎక్కువగా మాస్ జోనర్లో సినిమా చేసింది లేదు. అయినప్పటికీ గోపీచంద్ తో అతను ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు. గోపీచంద్ కెరీర్లో ఇది 33వ సినిమాగా మొదలైంది. ఈ ఏడాది చివర్లో ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.