ఎక్కడెక్కడి అద్భుతాలు అన్నీ మనకి సినిమాల్లోనే కనిపిస్తాయి.రాఘవేంద్ర రావు గారు చెప్పినట్టు లాజిక్ ఎండ్ అయినప్పుడే నిజమైన సినిమా మొదలవుతుంది. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానో పైన హెడ్డింగ్ ను బట్టి మీకు అర్ధమైపోతుంది.ఓ సినిమాలో భార్య భర్తలుగా కనిపించిన వాళ్ళు మరో సినిమాలో అన్నా చెల్లెళ్లుగా కనిపించవచ్చు. లేదా మామా అల్లుళ్లుగా కనిపించిన వాళ్ళు మరో సినిమాలో అన్నదమ్ములుగా కనిపించవచ్చు.హీరోల విషయంలో ఇవి ఇంకా టాప్ లెవెల్లో ఉంటాయి. ఉదాహరణకి ..
‘బడిపంతులు’ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ కు మనవరాలు పాత్ర చేసింది శ్రీదేవి. కానీ కొంతకాలం తర్వాత ‘వేటగాడు’ ‘జస్టిస్ చౌదరి’ ‘బొబ్బిలి సింహం’ వంటి సినిమాల్లో ఎన్టీఆర్ కు జోడీగా నటించింది. సరిగ్గా ఇలాంటి అద్భుతమే రాజశేఖర్ విషయంలో కూడా జరిగింది. వివరాల్లోకి వెళితే..1989వ సంవత్సరంలో రాజశేఖర్ హీరోగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ‘మమతల కోవెల’ అనే చిత్రం వచ్చింది. ఆ మూవీలో రాజశేఖర్ కు జోడీగా సుహాసిని నటించగా… రాజశేఖర్ కూతురి పాత్రలో రాశి(చైల్డ్ ఆర్టిస్ట్) గా నటించింది.
అయితే 1999 వ సంవత్సరంలో రాజశేఖర్ హీరోగా ఇవివి సత్యన్నారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘నేటి గాంధీ’ మూవీలో హీరోయిన్‌గా నటించింది రాశీ.ఆ మూవీలో రాజశేఖర్ నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రని పోషించగా రాశి.. విలన్ అండ్ గ్యాంగ్ వల్ల అత్యాచారానికి గురయ్యి ప్రాణాలు విడిచే అమ్మాయిగా నటించి కంటతడి పెట్టిస్తుంది. ట్రాజెడీ మరీ ఎక్కువగా ఉండడంతో ఆడియెన్స్ కూడా ఈ మూవీని యాక్సెప్ట్ చేయలేదు.