‘ధైర్యం’ హీరోయిన్ అనగానే 2005 లో వచ్చిన నితిన్ సినిమాలో హీరోయిన్ రైమా సేన్ అనుకుంటారేమో. ఈమె ఆమె కాదు. ఆమె ముంబై బ్యూటీ, ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది కన్నడ బ్యూటీ అయిన ‘అదితి ప్రభుదేవా’ గురించి. 2017 లో కన్నడలో రిలీజ్ అయిన ‘ధైర్యం’ అనే సినిమాతో ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అటు తర్వాత బ్రహ్మచారి, ఓల్డ్ మాంక్, సింగ, తోతాపురి చాప్టర్ 1 .. వంటి చిత్రాలతో కన్నడ సినీ పరిశ్రమలో క్రేజీ హీరోయిన్ గా మారింది.
కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న టైంలో అంటే 2022 లో ఎవ్వరూ ఊహించని విధంగా వ్యాపారవేత్త యషాస్ ను పెళ్లి చేసుకుని అందరికీ పెద్ద షాకిచ్చింది. ఇక కొన్ని నెలల క్రితం ఈమె ప్రెగ్నెంట్ అనే వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఇక ఈ కొత్త ఏడాది అభిమానులతో ఆమె ఆ గుడ్ న్యూస్ ను షేర్ చేసుకుంది. ఇప్పుడు ఆమెకు నెలలు నిండాయి. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఆమెకి ఘనంగా సీమంతం వేడుకను జరిపారు.
బంధు మిత్రులు.. ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె అభిమానులు కంగ్రాట్స్ చెబుతూనే.. సుఖప్రసవం కావాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం (Aditi Prabhudeva) అతిథి ప్రభుదేవా సీమంతం ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :