Alia Bhatt: ఆ సమయంలో చరణ్ కేరింగ్ గా చూసుకున్నారు.. అలియా కామెంట్స్ వైరల్!

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ విడుదలై దాదాపుగా 20 నెలలు అవుతున్నా ఈ సినిమా ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తోంది. వికీపీడియాలో ఈ సినిమా కలెక్షన్లు సాధించిన కలెక్షన్లతో పోల్చి చూస్తే ఎక్కువ మొత్తంగా ఉండటంతో సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్, అలియా భట్ అద్భుతంగా నటించగా ఈ జోడీని అభిమానించే ఫ్యాన్స్ సైతం ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. తాజాగా అలియా భట్ ఒక సందర్భంలో చరణ్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.

ఒక యాక్టర్ గా పర్సన్ గా చరణ్ చాలా గొప్పవాడని అలియా భట్ చేసిన కామెంట్లు రామ్ చరణ్ అభిమానుల సంతోషానికి కారణమవుతున్నాయి. ఫోర్బ్స్ ఇంటర్వ్యూలో అలియా భట్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్ నా బెస్ట్ ఫ్రెండ్ అని ఈ విషయాన్ని గర్వంగా చెబుతున్నానని ఆమె తెలిపారు. ఒక సన్నివేశం షూట్ చేయడానికి ముందే రామ్ చరణ్ నిశితంగా గమనిస్తాడని తనకు సంబంధించిన సీన్స్ ను డిగ్నిటీతో పూర్తి చేస్తాడని అలియా భట్ కామెంట్లు చేశారు.

అదే సమయంలో రామ్ చరణ్ సరదాగా ఉంటారని కేరింగ్ గా చూసుకుంటాడని అలియా భట్ పేర్కొన్నారు. చరణ్ అలియా కాంబోలో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ ఆశిస్తుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. చరణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో థియేటర్లలో విడుదల కానుండగా చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ షూట్ కూడా సమ్మర్ లో మొదలుకానుంది.

రామ్ చరణ్ త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించే ఛాన్స్ అయితే ఉంది. పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో రామ్ చరణ్ వరుస సినిమాలను ప్రకటించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

బబుల్ గమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఖైదీ నెంబర్ 786’ టు ‘ఠాగూర్’.. తెలుగులో రీమేక్ అయిన విజయ్ కాంత్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus