సినీ పరిశ్రమలో మరో విషాదం .. క్యాన్సర్ తో నటి కన్నుమూత!

  • August 7, 2023 / 10:19 AM IST

సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రముఖ నటులు, నిర్మాతలు, దర్శకులు లేదంటే వారి కుటుంబ సభ్యులు ఇలా ఎవరోకరు మరణిస్తూనే ఉన్నారు. కొంతమంది అనారోగ్య సమస్యలతో మరికొంతమంది వయసు సంబంధిత సమస్యలతో మరణిస్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం.ఇంకొంతమంది అయితే ఆత్మహత్య చేసుకుని కూడా చనిపోయారు. అలాగే మొన్నామధ్య సింగర్ కాల్పులకు గురయ్యి మరణించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా..గద్దర్ మరణించి 24 గంటలు కాకుండానే మరో విషాదకరమైన వార్త వినాల్సి వచ్చింది. అవును కోలీవుడ్ లో ఓ విషాదం చోటు చేసుకుంది.ప్రముఖ నటి కన్నుమూసింది.

వివరాల్లోకి వెళితే … ‘అంగడితేరు’ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సింధు ఈరోజు కన్నుమూశారు. చాలా కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ… వచ్చిన ఆమె ఈరోజు తెల్లవారుజామున 2.15 గంటలకు చివరి శ్వాస విడిచినట్లు సమాచారం. పరిస్థితి విషమించడంతో ఆమె కన్నుమూసినట్లు స్పష్టమవుతుంది. ఈమె వయసు 42 ఏళ్ళు మాత్రమే కావడం గమనార్హం.

ఈ విషయాన్ని ప్రముఖ నటుడు కోటంగుచ్చి తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా తెలుపుతూ ఓ పోస్ట్‌ పెట్టాడు. తన మరణానికి చింతిస్తూ తన సానుభూతి తెలుపుతున్నట్టు చెప్పుకొచ్చాడు.అలాగే పలువురు కోలీవుడ్ సినీ ప్రముఖులు సింధు ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొస్తున్నారు. సింధు చాలా మంచి వ్యక్తి అని .. ఆమె మరణం ఇండస్ట్రీకి తీరని లోటని వారు చెప్పుకొస్తున్నారు. సింధు మరణంతో కోలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus