ఇండస్ట్రీకి అంజలిని దూరం చేసిన ఇప్పుడు ఒటీటీలోకి

ప్రతి హీరో/హీరోయిన్ కి తమ కెరీర్ కు బూస్ట్ సినిమా ఉన్నట్లే.. కెరీర్ ను పాడుచేసిన సినిమా కూడా ఉంటుంది. అలా అంజలి కెరీర్ ని నాశనం చేసిన సినిమా “బెలూన్”. సినిమా ద్వారా కెరీర్ నాశనం అయ్యింది అంటే సినిమా ఫ్లాప్ అయ్యి అనుకుంటారేమో.. కనీసం ఆ సినిమా విడుదల కూడా కాలేదు. మరి విడుదలవ్వని సినిమా ఆమె కెరీర్ ను ఎలా ఎఫెక్ట్ చేసింది అంటే.. ఆ సినిమాలో హీరోగా నటించిన జైతో అంజలి కొన్నాళ్లపాటు సహజీవనం చేసి,

ఘాడంగా కొన్నాళ్లు ప్రేమించుకొన్నాక బోర్ కొట్టో, గొడవలయ్యో అంజలి & జై విడిపోయారు. ఆ తర్వాత సినిమా కూడా ఆగిపోయింది. ఇన్నాళ్ల తర్వాత ఆ సినిమా ఇప్పుడు జీ5 యాప్ ద్వారా ఒటీటీ రిలీజ్ కి రెడీ అయ్యింది. జులై 10న ఈ చిత్రం స్ట్రీమ్ అవ్వనుంది. హారర్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు విడుదలవుతుండడం పాపం అంజలికి కూడా ఇష్టం లేనట్లుంది. అందుకే నిర్మాతలు రిలీజ్ కి ఏదో హడావుడిపడుతుంటే

ఆమె కనీసం తన సోషల్ మీడియా ఎకౌంట్స్ లో కూడా సినిమా రిలీజ్ గురించి చిన్న పోస్ట్ కూడా పెట్టడం లేదు. ఇక జై అయితే ప్రొజెక్ట్ గురించి పట్టించుకోవడం కూడా మానేశాడు. మరి ఈ సినిమాను ఒటీటీ ఆడియన్స్ అయినా పట్టించుకొంటారో లేదో చూడాలి.

Most Recommended Video

భానుమతి & రామకృష్ణ సినిమా రివ్యూ & రేటింగ్!
సినిమాల్లోకి రాకముందు మన హీరోయిన్స్ ఎలా ఉంటారో చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!
అట్టర్ ఫ్లాప్ సీజన్ అంటే ఇదేనేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus