Anushka: పెళ్లి పై అనుష్క శెట్టి లేటెస్ట్ కామెంట్స్ వైరల్!

అనుష్క శెట్టి.. ప్రస్తుతం సౌత్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ లో ఒకరు. ఆమె సినిమాల్లో నటించడం తగ్గించింది కానీ.. ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అనేది వాస్తవం. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. అనుష్క పర్సనల్ లైఫ్ గురించి జనాల్లో ఆసక్తి ఎక్కువ. ఎందుకంటే ఆమెకు ఇప్పుడు 40 ఏళ్ళ వయసు. అయినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ప్రభాస్ తో ప్రేమలో ఉన్నట్లు.. అతన్నే పెళ్లి చేసుకోబోతున్నట్లు చాలా కాలం ప్రచారం జరిగింది. వాళ్ళు ఖండించినా ఈ వార్తలు ఆగలేదు.

తర్వాత జనాలు కూడా ఈ రూమర్స్ ను లైట్ తీసుకున్నారు. అయితే మరోపక్క త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చింది. ఆమె ఈ విషయంపై స్పందిస్తూ.. “పెళ్లి, పిల్లలు, ఫ్యామిలీ అంటే నాకు ఇష్టమే.. కానీ ఆ టైం ఇంకా రావడం లేదు” అంటూ చెప్పుకొచ్చింది. ’40 ఏళ్ళు వచ్చినా ఇంకా టైం రాకపోవడమేంటి? ఆమెకు ఏవో సమస్యలు ఉన్నట్లు ఉన్నాయి’ అంటూ అంతా అభిప్రాయపడుతున్నారు.

గత 10 ఏళ్లుగా అనుష్క పెళ్లి గురించి ఇలాంటి సమాధానాలే ఇస్తుంది. ఇక ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాలో అనుష్క .. అన్విత అనే చెఫ్ పాత్రలో కనిపించనుంది. ప్రేమ, పెళ్లి అనే ఫీలింగ్ లేకుండా ఓ బిడ్డకు సరోగసి పద్దతిలో జన్మనివ్వాలి అనుకునే ఆ అమ్మాయి లైఫ్ లోకి స్టాండప్ కమెడియన్ అయిన హీరో ఎంటర్ అయ్యాక ఆమె లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది అనేది ఆ సినిమా కథగా తెలుస్తుంది.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus